Chandrababu : కుప్పంలో బాబుకు ఘన స్వాగతం
పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు
- By Sudheer Published Date - 04:31 PM, Tue - 25 June 24

సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు (Chandrababu) ఈరోజు కుప్పంలో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులు , ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మాములుగా సీఎం అంటే భారీ భద్రత ..చుట్టూ పోలీసులు..ప్రజలకు దగ్గరికి కూడా రానివ్వరు. కానీ కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన అందుకు బిన్నంగా కొనసాగుతోంది. పోలీసులు, ప్రత్యేక సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రతిఒక్కరు బస్సు దగ్గర వచ్చి బాబుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలతో మమేకం అవుతూ.. బాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతకు ముందు మధ్యాహ్నం 12.59 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ పిఈఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ కు చేరుకున్నారు. ఈసందర్భంగా సీఎం కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ పి.శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా శాసనసభ్యులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును చూసేందుకు, పలకరించేందుకు వచ్చిన అశేష జనవాహినికి ఆయన అభివాదం చేస్తూ.. పలకరిస్తూ.. వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు. అనంతరం పిఈఎస్ మెడికల్ కళాశాల నుండి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరారు.
నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు#CBNInKuppam #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/XNkfdjjWCa
— Telugu Desam Party (@JaiTDP) June 25, 2024
Read Also : China – Moon: చైనా ‘చాంగే-6’ రికార్డ్.. చంద్రుడిపై నుంచి ఏం తెచ్చిందో తెలుసా ?