Jangareddygudem: అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు.
- Author : Balu J
Date : 18-06-2022 - 3:21 IST
Published By : Hashtagu Telugu Desk
విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యరంగా ప్రవర్తిస్తూ అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, సప్లిమెంటరీ తరగతులకు హాజరైన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన ఘటన గురించి ఇంట్లో తల్లిదండ్రులకు తెలిపింది విద్యార్థిని. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. దీంతో పోలీసులు పాఠశాలకు చేరుకొని విచారిస్తున్నారు.