CI Suicide: పోలీస్ శాఖకు షాక్, తాడిపత్రి సీఐ ఆత్మహత్య!
తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
- Author : Balu J
Date : 03-07-2023 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో నా లేక పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు అని పలువురు ఆరోపిస్తుండగా, పని ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్న సీఐ కూతురు,భవ్య చెబుతోంది. ఈ మేరకు కుటుంబ సభ్యులను డిఎస్పి గంగయ్య విచారిస్తున్నారు. ఈయన గతంలో కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, రైల్వే కోడూరు, పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, వేముల మండలాల ఎస్సైగా విధులు నిర్వర్తించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు సోమవారం తెల్లవారుజామున ఉత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పోలీస్‌శాఖకు షాక్ ఇచ్చింది. తాడిపత్రిలో నంద్యాల రోడ్డులో నివాసం వుంటున్న ఆయన ఇంట్లో ఉరి వేసుకుని (Hanging) తనువు చాలించినట్టు సమాచారం. కుటుంబ సమస్యలే ఆయన ఆత్మహత్యకు కారణమని మరికొందరు అంటున్నారు.
Also Read: BoyapatiRAPO: అప్ డేట్ అదిరింది, బోయపాటి-రామ్ మాస్ సినిమా పేరు ‘స్కంధ’