IBPS Clerks : 6వేల ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు
ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు పెరిగింది. ఇప్పుడు అభ్యర్థులు జులై 28 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
- By Pasha Published Date - 07:52 AM, Thu - 25 July 24

IBPS Clerks : ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు పెరిగింది. ఇప్పుడు అభ్యర్థులు జులై 28 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. బ్యాంకుల్లో జాబ్స్ కావాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(Bank Jobs) ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈసారి రిక్రూట్‌మెంట్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలలో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులలో 105 ఏపీలో, 104 పోస్టులు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణాలోని హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలులలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఐబీపీఎస్ క్లర్క్(IBPS Clerks) ఉద్యోగాలకు అర్హులైన వారు https://www.ibps.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు దరఖాస్తులు సమర్పించవచ్చు. 20 నుంచి 28 ఏళ్లలోపు వయసు కలిగినవారు అప్లికేషన్లు సమర్పించాలి. అయితే వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజుగా రూ.175 చెల్లించాలి.
Also Read :Charlotte Dujardin: పారిస్ ఒలింపిక్స్‌కు స్టార్ క్రీడాకారిణి దూరం.. కారణమిదే..?
- ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు అప్లై చేసిన వారికి ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అర్హులను క్లర్క్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
- 2024 ఆగస్టు 12 నుంచి 17 వరకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్‌ను నిర్వహిస్తారు.
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షను 2024 ఆగస్టు 24, 25, 31 తేదీలలో నిర్వహిస్తారు.
- 2024 సెప్టెంబరులో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు.
- 2024 అక్టోబర్ 13న ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఉంటుంది.