Potti Sriramulu Statue : అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం – సీఎం చంద్రబాబు
Potti Sriramulu Statue : పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం లభించిందని, ఆయన త్యాగాలను తలచుకుంటూ ప్రతి ఏటా ఘనంగా జయంతిని నిర్వహించాలని
- By Sudheer Published Date - 02:57 PM, Sun - 16 March 25

ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు జయంతిని (Potti Sriramulu Jayanti celebrated in Andhra Pradesh) పురస్కరించుకుని, ఆయన సేవలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమరజీవి జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు గ్రామం అభివృద్ధి చేసి మ్యూజియం ఏర్పాటు చేస్తామని, ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తామని సీఎం అన్నారు.
Shankh Naad: ఇంట్లో శంఖానాదం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ఏడాది పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఆయన జన్మస్థలం నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. గ్రామంలో ఆయన జీవితం, త్యాగాలను ప్రతిబింబించేలా మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శ్రీరాములు పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాలను నెలకొల్పుతామని చంద్రబాబు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం లభించిందని, ఆయన త్యాగాలను తలచుకుంటూ ప్రతి ఏటా ఘనంగా జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.