HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Shankh Naad Significance In Telugu And Advantages Benefits

Shankh Naad: ఇంట్లో శంఖానాదం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

ఇంట్లో పూజ తరువాత శంఖానాదం చేయడం వల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయట. ఇది చాలా శుభప్రదం అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 16-03-2025 - 2:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shankh Naad
Shankh Naad

పురాణాల ప్రకారం క్షీర సాగర మథనం సమయంలో ఉద్భవించిన వస్తువులలో శంఖం కూడా ఒకటి. ఈ శంఖం పేరే పాంచ జన్యం. దీనిని శ్రీమహా విష్ణువు స్వీకరించాడని చెబుతున్నారు. శ్రీ మహాలక్ష్మి తోబుట్టువుగా కూడా శంఖాన్ని భావిస్తారు. అందుకే పూజా గదిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉందని చెబుతున్నారు దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయట. కాగా శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం. ఇందులో మొదట దక్షిణావృత శంఖం విషయానికి వస్తే.. దక్షిణావృత శంఖాలను ఎక్కువగా పూజలో ఉపయోగించరట. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుందట. ఈ శంఖం కుడి వైపు తెరుచుకుని ఉంటుందట. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి అభి ముఖంగా నిల్చొని శంఖం నుంచి నీటిని ధారగా పోస్తూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయట.

వామా వృత శంఖం విషయానికి వస్తే.. వామా వృత శంఖం ఎడమ వైపుకు తెరుచుకుని ఉంటుందట. మాములుగా అన్ని రకాల పూజల్లో తరచుగా వాడేది ఈ శంఖమే. ఈ వామావృత శంఖం ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకు కూడా రావట. కాగా శంఖనాదంతో ఉద్భవించే సానుకూల శక్తులు శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుందట. అలాగే శంఖనాదం జరిగిన ప్రదేశానికి చుట్టు పక్కల ఉండే క్రిమి కీటకాలు కూడా నాశనమైపోతాయట.

శంఖం ధ్వని విజయానికి, సుఖానికి,కీర్తి ప్రతిష్టకు,, సమృద్ధికి, లక్ష్మీ రాకకు ప్రతీకగా భావించాలని చెబుతున్నారు. రోజూ ఇంట్లో శంఖనాదం చేయడం వలన ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయట. శంఖనాదం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయట. శంఖనాదం వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, మనశ్శాంతి, వివాహప్రాప్తి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనసులో ఉన్న కోరికలు తీరుతాయట. దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార, ధనాభివృద్ధి కలుగుతుందని, శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదట. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • house
  • money
  • Shankh Naad

Related News

Simply planting these three trees—which are highly favored by Kubera—in the right direction at home will lead to a shower of wealth.

Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

మామూలుగా మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అందులో కొన్ని రకాల మొక్కలు మనకు పాజిటివ్ ఎనర్జీని తెస్తే, మరికొన్ని మొక్కలు నెగటివ్ ఎనర్జీని తెస్తాయి. అలాగే కొన్ని రకాల మొక్కలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, సంపద మరియు అభివృద్ధిని పెరిగేలా చేస్తాయి. అటువంటి వాటిలో కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు మొక్కలు కూడా ఒకటి. కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు చెట్ల

    Latest News

    • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

    • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

    • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

    • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

    • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd