Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2వ విడతలో రూ.45.53 కోట్లు విడుదల
విదేశీ విద్యకు మంచి కాలేజీల్లో సీట్లొచ్చినా.. డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో విద్య ఒక వరంలా ఉండాలన్న ఉద్దేశంతో జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అమలు చేశారు సీఎం జగన్
- By Praveen Aluthuru Published Date - 01:51 PM, Thu - 27 July 23

Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్యకు మంచి కాలేజీల్లో సీట్లొచ్చినా.. డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో విద్య ఒక వరంలా ఉండాలన్న ఉద్దేశంతో జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అమలు చేశారు సీఎం జగన్. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం క్రింద ఈ ఏడాది 2వ విడత సాయాన్ని ఈ రోజు శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్(CM Jagan) బటన్ నొక్కి విడుదల చేశారు.
విదేశీ విద్యా దీవెన పథకం కింద 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమచేశారు. గడచిన ఆరునెలల్లో ఈ పథకం కింద మొత్తంగా రూ.65.48 కోట్లు విడుదల అయ్యాయి. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అత్యంత పారదర్శకంగా.. అవినీతికి, వివక్షకు తావులేకుండా అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఫీజుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తుందని సీఎం చెప్పారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తుంది ఏపీ ప్రభుత్వం.
Also Read: Varun Tej’s Pan India Film: వరుణ్ తేజ్ కొత్త సినిమా, మట్కాతో తొలి పాన్ ఇండియా మూవీ