Tsunami 20 Years : 20 ఏళ్ల క్రితం ఏపీని వణికించిన సునామీ.. 14 దేశాలకు వణుకు
అప్పట్లో సునామీ(Tsunami 20 Years) ప్రభావంతో పలు దేశాల్లోని సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్‌పై 9.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
- By Pasha Published Date - 10:21 AM, Thu - 26 December 24

Tsunami 20 Years : సునామీ దడ పుట్టించి 20 ఏళ్లు గడిచిపోయాయి. 2004 సంవత్సరం డిసెంబరు 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ భారత్ సహా 14 దేశాలను అతలాకుతలం చేసింది. ఆనాడు సముద్రంలో 4 మీటర్ల మేర రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 985 కి.మీ తీర ప్రాంతం ప్రభావితమైంది. 2004 డిసెంబరు 26న ఉదయం 09:05 గంటలకు భారీ అలలు సముద్ర తీరాన్ని తాకాయి. ఏపీలోని 301 గ్రామాలు దీనివల్ల ప్రభావితమయ్యాయి. 105 మంది చనిపోయారు. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సునామీ ఎఫెక్టు ఎక్కువగా కనిపించింది. ఆ మూడు జిల్లాల పరిధిలో 82 మంది చనిపోయారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా జనం ప్రభావితులు అయ్యారు. సునామీ ప్రభావంతో ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27 మంది, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20 మంది, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 35 మంది, ఇతర ప్రాంతాల్లో 23 మంది చనిపోయారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఆ సునామీ వల్ల ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది చనిపోయారు.
Also Read :AP Danger Bells : ఏపీలో 44 శాతం భూభాగానికి డేంజర్ బెల్స్.. ప్రకృతి విపత్తుల గండం
అప్పట్లో సునామీ(Tsunami 20 Years) ప్రభావంతో పలు దేశాల్లోని సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్‌పై 9.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ టైంలో సముద్ర గర్భంలో దాదాపు పది నిమిషాలపాటు భూమి కంటిన్యూగా కంపించింది. అందువల్లే హిందూ మహాసముద్రంలో రాకాసి అలలు ఏర్పడ్డాయి. అవి తీర ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్‌లాండ్, మాల్దీవులు సహా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, బ్రిటన్, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో సైతం అలలు ఎగిసిపడ్డాయి.
Also Read :Formula E Race Case : ఆ ఇద్దరి వాంగ్మూలాలను సేకరించాకే కేటీఆర్ విచారణ ?
2004లో సునామీ చోటుచేసుకున్న సందర్భంగా సముద్రంలో సంభవించిన భూకంపం అత్యంత శక్తివంతమైంది. అది ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డులకు ఎక్కింది. ప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన భూకంపాల్లో అది మూడో శక్తివంతమైన భూకంపం. సముద్ర గర్భంలో వచ్చిన ఆ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం అని చెబుతారు.