బాల్యం బక్క చిక్కుతోంది..!
మనం తినే ఫుడ్ సరైంది కాదా..? పిల్లలు తీసుకునే ఆహారంలో పోషకాలు మిస్ అవుతున్నాయా.. ఈ తరం పిల్లలు రక్తహీనత, పోషకార సమస్యలతో బాధపడుతున్నారా..? అంటే అవుననే అంటోంది నీతి అయోగ్. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11.3 లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు స్పష్టం చేసింది.
- Author : Balu J
Date : 02-10-2021 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
మనం తినే ఫుడ్ సరైంది కాదా..? పిల్లలు తీసుకునే ఆహారంలో పోషకాలు మిస్ అవుతున్నాయా.. ఈ తరం పిల్లలు రక్తహీనత, పోషకార సమస్యలతో బాధపడుతున్నారా..? అంటే అవుననే అంటోంది నీతి అయోగ్. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11.3 లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు స్పష్టం చేసింది.
నీతి అయోగ్ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం 11,30,459 (ఐదేండ్లలోపు) మంది పిల్లలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రకటించింది. కేవలం 21,11,369 మంది బాలబాలికలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సాయంతో నీతి అయోగ్ ‘ది స్టేట్ న్యూట్రిషన్ ప్రొఫైల్స్’ ప్రారంభించింది. అయితే శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 5,92,566 మంది పిల్లలను చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తుండగా, 2,23,705 మంది పిల్లలు మేజర్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారని తెలిపింది. కర్నూలులో అత్యధికంగా1,79,685 మంది పిల్లలు, అనంతపురం 1,12,943 మంది, విశాఖపట్నం 99,556 మంది పిల్లలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఇక రక్తహీనత విషయానికి వస్తే కర్నూలులో అత్యధికంగా 2,26,296 మంది, తూర్పు గోదావరి 2,23,410, విశాఖపట్నంలో 2,09,442 మంది పిల్లలున్నారు. పోషకాహారం, రక్తహీనత సమస్యతోనే కాకుండా అతి తక్కువ బరువు సమస్యలు కూడా పిల్లలను వేధిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10,78,332 తక్కువ బరువు ఉన్న పిల్లలు ఉన్నారు. అందులో కర్నూలు 1,64,741 తో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత అనంతపురం 1,27,374, విశాఖపట్నం 1,07,584 ఉన్నాయి.
నీతి అయోగ్ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 6 ఏండ్ల నుంచి 12 వయసు ఉన్న పిల్లల ఆరోగ్యం కొంతవరకు భాగానే ఉన్నప్పటికీ, ముఖ్యంగా 0-5 పిల్లలు ఇతర అనారోగ్య సమస్యలతో కొట్టామిట్టాడుతుండటం ఆంధ్రప్రదేశ్ ను వేధించే సమస్య. ఇప్పటికైనా పెరిగే పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీతి అయోగ్ విడుదల చేసిన గణాంకాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.