Navagraha : నవగ్రహాల ఆశీస్సులు కావాలా ? ఇలా చేయండి
వ్యక్తుల జాతకాలను నవగ్రహాలే నిర్ణయిస్తాయని పండితులు చెబుతుంటారు.
- By Pasha Published Date - 01:41 PM, Sun - 30 June 24
Navagraha : వ్యక్తుల జాతకాలను నవగ్రహాలే నిర్ణయిస్తాయని పండితులు చెబుతుంటారు. నవ గ్రహాలు సంచరించే స్థానాన్ని బట్టి వ్యక్తులపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు పడుతుంటాయి. ఏదైనా గ్రహ ప్రభావం వల్ల జీవితాన్ని ప్రతికూలతలు అలుముకునే అవకాశం ఉంటుందని పండితుల ద్వారా తెలుసుకుంటే.. ఆయా గ్రహాల శాంతి కోసం పరిహారాలు చేయొచ్చు. ఇందులో భాగంగా పూజలు, దానాలు చేయొచ్చు. ఇందుకోసం కొంత డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక స్థోమత ఉన్నవారైతే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు. అంత డబ్బు ఖర్చు పెట్టలేని వారి కోసం కొన్ని పరిహారాలు అందుబాటులో ఉన్నాయని పండితులు(Navagraha) చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
శని గ్రహం
- శనిగ్రహం అంటే భయం అనవసరం.
- ఈ గ్రహం సంతోషాన్ని కూడా కలిగించగలదు.
- మనిషి ఆయుష్షుపై శనిగ్రహం ప్రభావం చూపగలదు.
- ఇంట్లో పనివారికి తగినంత జీతం ఇస్తే శని గ్రహం సంతోషిస్తుంది.
- బీద సాదలకు, వికలాంగులకు సహాయం చేసినా శని సంతోషిస్తాడు.
సూర్యుడు
- సూర్యుడు సంతోషించాలంటే మనం ఎవరి నుంచి కూడా వస్తువులను ఫ్రీగా తీసుకోకూడదు.
- పేరెంట్స్‌ను గౌరవిస్తే సూర్యుడు సంతోషిస్తాడు.
- అధికారం, ఆరోగ్యం, రాజకీయాల్లో ఎదుగుదల ఉండాలంటే సూర్యుడి ఆశీస్సులు పొందాలి.
చంద్రుడు
- చంద్రుడి అనుగ్రహం పొందాలంటే.. ఎవరికీ పాలు, నీళ్లు ఫ్రీగా ఇవ్వకూడదు. మటన్ తినరాదు.
- చంద్రుడు మన మనస్సును కంట్రోల్ చేస్తాడు.
- క్రీడా, సినీ రంగాల్లో రాణించాలంటే చంద్రబలం అవసరం.
Also Read :Kitchen Donts : వంటగదిలో చేయకూడని పనులు ఇవే..
గురువు
- ఆర్థికంగా, విద్యాపరంగా పేరు సంపాదించాలంటే గురు గ్రహం అనుగ్రహం ఉండాలి.
- ఇంటికి వచ్చిన అతిథులను గౌరవిస్తే గురు గ్రహం సంతోషిస్తుంది.
- పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకుంటే గురు గ్రహం సంతోషిస్తుంది. ఆడవారు అయితే ముఖానికి ఈ పసుపు రాసుకోవాలి.
శుక్రుడు
- ఇంటి ఆడపిల్లలను గౌరవిస్తే శుక్రుడు సంతోషిస్తాడు.
- రాజయోగం రావాలంటే శుక్రుడు అనుగ్రహం చూపాల్సిందే.
- విలాసవంతమైన జీవితం కూడా శుక్రుడి అనుగ్రహం వల్లే ప్రాప్తిస్తుంది.
రాహువు
- రాహువు అనుగ్రహం ఉండాలంటే ఇంట్లో కుక్కలను పెంచరాదు.
- మనుషుల అనూహ్య ఎదుగుదలకు, పతనానికి కారకుడు రాహువే.
- బ్లూ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే రాహువు ఆగ్రహిస్తాడు.
కేతువు
- కేతువు అనుగ్రహం లభిస్తే ఏ రంగంలో ఉన్నా నంబర్ 1 ప్లేస్ లభిస్తుంది.
- తప్పుడు వాగ్దానాలు చేసే వారిని కేతువు మెచ్చడు.
- కొన్ని రకాల వ్యక్తుల నుంచి భూమిని కొన్నా కేతువు మెచ్చడని పండితులు అంటారు.
కుజుడు
- రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే కుజుడి అనుగ్రహం అవసరం.
- కుజుడి ప్రభావం ఉన్నవారు చక్కెర వ్యాపారానికి దూరంగా ఉండటం మంచిది.
- కొన్ని రకాల వ్యక్తులకు దూరం పాటించడాన్ని కుజుడు ఇష్టపడతాడు.
బుధుడు
- బుధుడు సంతోషించాలంటే మాంసాహారం, గుడ్లు, చేపలు తినకూడదు.
- వ్యాపారంలో రాణించాలంటే బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి.
- మేనమామను ఆదరిస్తే బుధుడు సంతోషిస్తాడు.
Also Read :Search On Mobile : గూగుల్ క్రోమ్‌లో 5 కొత్త ‘సెర్చ్’ ఫీచర్స్
Related News
Durga Ashtami 2024: శుక్ల పక్షంలోని అష్టమి తేదీన దుర్గాష్టమి
దుర్గాష్టమి ప్రతి నెల శుక్ల పక్షంలోని అష్టమి తేదీన జరుపుకుంటారు. ఆ రోజున లోకమాత దుర్గా దేవిని ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. అలాగే దుర్గాష్టమి వ్రతం పాటిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ వ్రత మహిమ గ్రంథాలలో కూడా ఉంది. దుర్గా దేవిని పూజించడం ద్వారా