Kitchen Donts : వంటగదిలో చేయకూడని పనులు ఇవే..
వంటగదిని ఎలా ఉంచాలి ? ఎలా మెయింటైన్ చేయాలి ? అనే విషయం మనందరికీ తెలుసు.
- By Pasha Published Date - 11:46 AM, Sun - 30 June 24
Kitchen Donts : వంటగదిని ఎలా ఉంచాలి ? ఎలా మెయింటైన్ చేయాలి ? అనే విషయం మనందరికీ తెలుసు. అయితే వంటగదిలో చేయకూడని పనులు, ఉంచకూడని వస్తువుల గురించి చాలామందికి తెలియదు. ఇంతకీ అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join
- వంటగదిలో మందులను ఉంచకూడదు. ఇవి కిచెన్లో(Kitchen Donts) ఉంచడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది.
- ఉప్పును ఇనుము లేదా ఉక్కు పాత్రలు, డబ్బాలలో నిల్వ చేయకూడదు.
- పాడైన ఆహారం వంటింట్లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
- పనికిరాని పదార్థాలు, వస్తువులు వంట గదిలో ఉంచొద్దు. అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుంది.
- ఇంట్లో చిరుధాన్యాలు, ఇతర వంట సామగ్రి స్టోర్ చేసుకునే డబ్బాలు, సీసాలు ఖాళీగా ఉంచకూడదు.ఖాళీ డబ్బాలు ఇంట్లో లేమిని సూచిస్తాయి. ఖాళీ డబ్బాలు ఉంటే ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తర దిశలలో నిల్వ చేసుకోవాలి.
- పనిచేయని ఎలక్ట్రానిక్ కిచెన్ సామాగ్రిని వంటగదిలో ఉంచకూడదు.
- కిచెన్లో కత్తులు, కత్తెరలు, ఇతర పదునైన వస్తువులను వాటికి కేటాయించిన స్థానంలో ఉంచాలి. ఎక్కడపడితే అక్కడ ఉంచితే ఇంట్లో ఆర్థిక సుస్థిరత ఏర్పడుతుంది.
- విరిగిన, పగిలిన పాత్రలను వంటగదిలో ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే అప్పులు పెరుగుతాయి.
Also Read :Army Chief – Navy Chief : ఆర్మీ, నేవీ చీఫ్లుగా క్లాస్మేట్స్.. కొత్త చరిత్ర లిఖించిన ఫ్రెండ్స్
- కొంతమంది వంటగదిలోనే దేవుడి గది కలిసి ఉంటుంది. అలాంటప్పుడు దేవుడి పటాలు.. విగ్రహాలు జిడ్డు పట్టే అవకాశం ఉంది. అవకాశం ఉంటే వేరు వేరు గదులను ఏర్పాటు చేసుకోండి.
- వంటగదిని, దేవుడి గదిని వేరు చేసుకోవడానికి మధ్యలో సన్నటి గోడ కట్టుకోండి. లేదా కర్టెన్ కట్టినా సరిపోతుంది.
- ఇంటిలో వంటగది నాలుగోభాగం కంటే తక్కువగా ఉండాలి.
- వాస్తు ప్రకారం తూర్పువైపు ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి.
- వంట వండేవాళ్లు ఈస్ట్ ఫేస్ పెట్టి వంట చేయాలి.
- మాస్టర్ బెడ్రూమ్ ఇంటి నైరుతి మూలలో నిర్మించాలి.
- నీళ్ల ట్యాంక్ ఇంటి కంటే ఎత్తులో ఉండాలి.