Kitchen Donts : వంటగదిలో చేయకూడని పనులు ఇవే..

వంటగదిని ఎలా ఉంచాలి ? ఎలా మెయింటైన్ చేయాలి ? అనే విషయం మనందరికీ తెలుసు.

  • Written By:
  • Updated On - June 30, 2024 / 11:54 AM IST

Kitchen Donts : వంటగదిని ఎలా ఉంచాలి ? ఎలా మెయింటైన్ చేయాలి ? అనే విషయం మనందరికీ తెలుసు. అయితే వంటగదిలో చేయకూడని పనులు, ఉంచకూడని వస్తువుల గురించి చాలామందికి తెలియదు. ఇంతకీ అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

  • వంటగదిలో మందులను ఉంచకూడదు. ఇవి కిచెన్​లో(Kitchen Donts) ఉంచడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది.
  • ఉప్పును ఇనుము లేదా ఉక్కు పాత్రలు, డబ్బాలలో నిల్వ చేయకూడదు.
  • పాడైన ఆహారం వంటింట్లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
  • పనికిరాని పదార్థాలు, వస్తువులు వంట గదిలో ఉంచొద్దు. అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుంది.
  • ఇంట్లో చిరుధాన్యాలు, ఇతర వంట సామగ్రి స్టోర్ చేసుకునే డబ్బాలు, సీసాలు ఖాళీగా ఉంచకూడదు.ఖాళీ డబ్బాలు ఇంట్లో లేమిని సూచిస్తాయి.  ఖాళీ డబ్బాలు ఉంటే ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తర దిశలలో నిల్వ చేసుకోవాలి.
  • పనిచేయని ఎలక్ట్రానిక్ కిచెన్ సామాగ్రిని వంటగదిలో ఉంచకూడదు.
  • కిచెన్​లో కత్తులు, కత్తెరలు, ఇతర పదునైన వస్తువులను వాటికి కేటాయించిన స్థానంలో ఉంచాలి. ఎక్కడపడితే అక్కడ ఉంచితే ఇంట్లో ఆర్థిక సుస్థిరత ఏర్పడుతుంది.
  • విరిగిన, పగిలిన పాత్రలను వంటగదిలో ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే అప్పులు పెరుగుతాయి.
  • కొంతమంది వంటగదిలోనే దేవుడి గది కలిసి ఉంటుంది. అలాంటప్పుడు దేవుడి పటాలు.. విగ్రహాలు జిడ్డు పట్టే అవకాశం ఉంది. అవకాశం ఉంటే వేరు వేరు గదులను ఏర్పాటు చేసుకోండి.
  • వంటగదిని, దేవుడి గదిని వేరు చేసుకోవడానికి మధ్యలో సన్నటి గోడ కట్టుకోండి. లేదా కర్టెన్ కట్టినా సరిపోతుంది.
  • ఇంటిలో వంటగది నాలుగోభాగం కంటే తక్కువగా ఉండాలి.
  • వాస్తు ప్రకారం తూర్పువైపు ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి.
  • వంట వండేవాళ్లు ఈస్ట్ ఫేస్ పెట్టి వంట చేయాలి.
  • మాస్టర్ బెడ్రూమ్ ఇంటి నైరుతి మూలలో నిర్మించాలి.
  • నీళ్ల ట్యాంక్​ ఇంటి కంటే ఎత్తులో ఉండాలి.

Also Read :Dengue Prevention: వర్షాకాలంలో డెంగ్యూ రాకుండా ఉండాలంటే.. మ‌నం ఈ ప‌నులు చేయాల్సిందే..!