Russia-Ukraine War: కాల్చుకొని చచ్చిపోయే వాణ్ని.. లొంగిపోయేవాణ్ణి మాత్రం కాదు: జెలెన్ స్కీ
కీవ్ : 2022 ఫిబ్రవరి 24.. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసిన మొదటిరోజు అది. ఆ రోజున దేశ రాజధాని కీవ్ లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన కీలక వివరాలను
- Author : hashtagu
Date : 01-05-2023 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
Russia-Ukraine War: కీవ్ : 2022 ఫిబ్రవరి 24.. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసిన మొదటిరోజు అది. ఆ రోజున దేశ రాజధాని కీవ్ లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన కీలక వివరాలను స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దండయాత్ర స్టార్ట్ చేయగానే కీవ్ లోకి ప్రవేశించడానికి రష్యా ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాయని తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయాలు ఉన్న సెంటర్‌లోని బంకోవా స్ట్రీట్‌కు చేరుకోవడంలో అవి విఫలమయ్యాయని ఆయన చెప్పారు. ఒకవేళ ఆనాడు కీవ్ అధ్యక్ష ప్రధాన కార్యాలయంపై రష్యన్లు దాడి చేసి ఉంటే ఏం చేసి ఉండేవారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. “నా దగ్గర ఒక పిస్టల్ ఉంటుంది. దానితో షూట్ చేయడం వచ్చు. ఎలా షూట్ చేయాలనే దానిపై ఆ రోజు బాగా ప్రాక్టీస్ కూడా చేశాను. ఒకవేళ రష్యన్లు అధ్యక్ష ప్రధాన కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకొని ఉంటే.. తుపాకీతో నన్ను నేను కాల్చుకునే వాణ్ని. అంతేతప్ప లొంగిపోయే వాణ్ణి కాదు” అని వివరించారు. ” వాస్తవానికి మా అధ్యక్ష కార్యాలయం దాకా రష్యా యుద్ధ విమానాలు రాకుండా మేం పకడ్బందీగా ఆర్మీని మోహరించాం. ఫలితంగా 2022 ఫిబ్రవరి 24న కీవ్ సిటీ బార్డర్ లోనే రష్యా ఆర్మీ ఉండిపోయింది. ఇది కచ్చితంగా మా ఆర్మీ విజయమే ” అని చెప్పారు.
Read More: Silk Smitha: సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో ఏం రాసిందో చూశారా..? వింటే కన్నీళ్లు వస్తాయి