US Soldier: జపాన్‌లో మైనర్ బాలికపై అమెరికా సైనికుడు లైంగిక వేధింపులు
జపాన్‌లోని ఒకినావా దీవుల్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అమెరికా సైనికుడిపై ఆరోపణలు వచ్చాయి. నహా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం మార్చి 27న 25 ఏళ్ల బ్రెన్నాన్ వాషింగ్టన్‌పై అభియోగాలు నమోదు చేసింది. దీంతో అమెరికా మిలిటరీ ఉనికికి సంబంధించి స్థానిక నిరసనలు మరింత పెరిగే అవకాశం ఉంది.
- By Praveen Aluthuru Published Date - 06:14 PM, Wed - 26 June 24

US Soldier: జపాన్‌లోని ఒకినావా దీవుల్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అమెరికా సైనికుడిపై ఆరోపణలు వచ్చాయి. నహా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం మార్చి 27న 25 ఏళ్ల బ్రెన్నాన్ వాషింగ్టన్‌పై అభియోగాలు నమోదు చేసింది. దీంతో అమెరికా మిలిటరీ ఉనికికి సంబంధించి స్థానిక నిరసనలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అమెరికా వైమానిక దళ సభ్యుడు 2023, డిసెంబర్ 24న యోమిటాన్‌లోని ఒక పార్క్‌లో ఓ అమ్మాయిని తన కారులోకి ఆహ్వానించి తన నివాసానికి తీసుకెళ్లాడు, అక్కడ అతను అమ్మాయిని ముద్దుపెట్టుకున్నాడు. ఆమె శరీర భాగాలను తాకడం వంటి అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు. బాలిక వయస్సు 16 ఏళ్లలోపు అని తెలుస్తుంది. అయితే సదరు బాలికకు సంబంధించిన వ్యక్తి మరుసటి రోజు పోలీసులకు సమాచారం అందించాడు. కేసును విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసుకు సంబంధించిన తొలి విచారణ జూలై 12న నహా జిల్లా కోర్టులో జరుగుతుందని పోలీస్ అధికారి తెలిపారు.
1995లో 12 ఏళ్ల ఒకినావాన్ విద్యార్థినిపై ముగ్గురు అమెరికన్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. 2016లో ఒక మాజీ అమెరికన్ బేస్ ఉద్యోగి 20 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత అతనికి జీవిత ఖైదు శిక్ష పడింది.
Also Read: Water Supply In Hyderabad: హైదరాబాద్‌లో రేపు నీటి సరఫరాలో అంతరాయం