Trump Vs Biden : మళ్లీ ట్రంప్ గెలుస్తాడంట.. సంచలన సర్వే రిపోర్ట్
Trump Vs Biden : అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు గుడ్ న్యూస్. ‘‘వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది నేనే’’ అని చెప్పుకుంటున్న ఆయనకు అనుకూలంగా మరో రిపోర్ట్ వచ్చింది.
- Author : Pasha
Date : 25-09-2023 - 2:09 IST
Published By : Hashtagu Telugu Desk
Trump Vs Biden : అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు గుడ్ న్యూస్. ‘‘వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది నేనే’’ అని చెప్పుకుంటున్న ఆయనకు అనుకూలంగా మరో రిపోర్ట్ వచ్చింది. ABC News, Washington Post చేపట్టిన సర్వేలో బైడెన్ కన్నా ట్రంప్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. 2021లో ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే నాటికి 38 శాతం మంది మద్దతునివ్వగా.. ఇప్పుడా సంఖ్య 48 శాతానికి పెరిగింది. అయినా ఇప్పటికీ మరో 49 శాతం మంది ట్రంప్ పని తీరుపై అసహనంతో ఉన్నారు. దాదాపు 75 శాతం మంది ట్రంప్ కు మరోసారి అవకాశమివ్వాలని కోరుకుంటున్నట్టు వెల్లడైంది. బైడెన్ అమెరికా ఎకానమీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని, వలసలనూ ఆపలేకపోయారన్న అసహనాన్ని తాజా సర్వేలో ఓటర్లు వెల్లగక్కారు.
Also read : YCP is not Single : సింహం సింగిల్ కాదు, ఆయనకు ముగ్గురు..!
44 శాతం మంది అమెరికా పౌరులు బైడెన్ హయాంలో తమ ఆర్థిక స్థితి బాగా పడిపోయిందని చెప్పారు. 30 శాతం మంది పౌరులే బైడెన్‌కి అనుకూలంగా ఓటు వేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే బైడెన్ పని తీరుకు 37 శాతం ఓట్లు పడ్డాయి. 56 శాతం మంది వ్యతిరేకించారు. ఆయన వయసు గురించీ ఈ సర్వేలో చాలా మంది ప్రజలు చర్చించారు. వయోభారంతో దేశాన్ని ఎలా నడుపుతారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పారు. 2024 నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కు 51 శాతం మేర సపోర్ట్ ఉండగా…బైడెన్‌కి 42 శాతం వరకూ ఉంది. ఇది మారే అవకాశాలూ ఉన్నాయని సర్వే తెలిపింది.