Trump Link : మాస్కో ఉగ్రదాడి.. తెరపైకి ట్రంప్ పేరు.. ఎందుకు ?
Trump Link : రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌పై ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు తెరపైకి వచ్చింది.
- Author : Pasha
Date : 23-03-2024 - 7:54 IST
Published By : Hashtagu Telugu Desk
Trump Link : రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌పై ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు తెరపైకి వచ్చింది. 2013 సంవత్సరం నాటికి ట్రంప్ కేవలం అమెరికా అధ్యక్షుడు కాలేదు. అప్పట్లో ఆయన ఒక వ్యాపారవేత్త హోదాలో రష్యాతో మంచి సంబంధాలను నెరిపేవారు. స్వయంగా ట్రంప్ చొరవ చూపి 2013 సంవత్సరంలో క్రోకస్ సిటీ హాల్‌లో మిస్ యూనివర్స్ అందాల పోటీలను నిర్వహించారు. దానికి స్వయంగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కు హాజరుకావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా ఆహ్వానించానని ఆ కార్యక్రమం సందర్భంగా ట్రంప్ చెప్పారు. అయితే పుతిన్ రాలేదు.
We’re now on WhatsApp. Click to Join
- క్రోకస్ సిటీ హాల్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అరస్ అగలరోవ్ (68) నిర్మించారు. ఈయన అజర్‌బైజాన్ నుంచి రష్యాకు వచ్చి సెటిలయ్యారు. అరస్ అగలరోవ్‌కు ట్రంప్‌తో మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
- క్రోకస్ సిటీ హాల్‌ను 2009లో ప్రారంభించారు. ఈ వేదికను అజర్‌బైజాన్ నుంచి రష్యాకు వచ్చి స్థిరపడిన ప్రసిద్ధ పాప్ గాయకుడు ముస్లిం మాగోమాయేవ్‌కు అంకితమిచ్చారు.
- 2013లో క్రోకస్ సిటీ హాల్‌కు ట్రంప్ స్వయంగా వచ్చి అందాల పోటీలను నిర్వహించారు.
- 2021 నాటికి ఫోర్బ్స్ ప్రకారం అరస్ అగలరోవ్ నికర సంపద విలువ దాదాపు రూ.10వేల కోట్లు. ఈయన కంపెనీ క్రోకస్ గ్రూప్ లగ్జరీ రిటైల్, లీజర్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌లలో ప్రత్యేకతను కలిగి ఉంది. అమెరికాలోనూ డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, హోటళ్ల వ్యాపారం చేస్తుంటారు.
- అరస్ అగలరోవ్ కుమారుడు ఎమిన్ అగలరోవ్ ఒక పాప్ గాయకుడు. ఎమిన్ అగలరోవ్.. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ కుమార్తెకు మాజీ భర్త.
Also Read :60 Killed : 60 మంది మృతి, 100 మందికి గాయాలు.. రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రదాడి
- మాస్కో మెట్రో స్టేషన్ పక్కనే క్రోకస్ సిటీ హాల్ ఉంటుంది.
- మాస్కో నగరానికి వెలుపల ఇది ఉంది.
- షాపింగ్ సెంటర్, కాన్ఫరెన్స్ సెంటర్‌లను కలిగి ఉన్న ఈ కాంప్లెక్స్‌లో కార్ షోల వంటి ఈవెంట్స్ జరుగుతుంటాయి.
- మ్యూజిక్ కన్సర్ట్‌లు, ఇంటర్నేషనల్ మూవీ స్టార్స్‌తో ఈవెంట్స్‌ను ఇక్కడ నిర్వహిస్తుంటారు.
Also Read : IPL 2024 : బోణీ కొట్టిన CSK
రష్యాలోని మాస్కోలో ఉన్న క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. తాము తెచ్చుకున్న బాంబులు విసిరారు. ఈ ఘటనలో 60 మంది మృతిచెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఈవివరాలను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ కూడా ధ్రువీకరించింది. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్‌నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతుండగా ఈ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు విసిరిన బాంబుల ధాటికి కన్సర్ట్ హాల్ భవనంపై మంటలు చెలరేగాయి. నల్లటి పొగలు వ్యాపించాయి. చివరకు భవనమంతా మంటలు వ్యాపించాయి.