Somalia Hotel Siege : సోమాలియా హోటల్ ముట్టడించిన ఉగ్రవాదులు.. 9 మంది మృతి
Somalia Hotel Siege : సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్‌సైడ్ హోటల్ "పెరల్ బీచ్" ను ఉగ్రవాదులు 6 గంటల పాటు ముట్టడించిన ఘటనలో 9 మంది మరణించారు.
- By Pasha Published Date - 03:54 PM, Sat - 10 June 23

Somalia Hotel Siege : సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్‌సైడ్ హోటల్ “పెరల్ బీచ్” ను ఉగ్రవాదులు 6 గంటల పాటు ముట్టడించిన ఘటనలో 9 మంది మరణించారు. 10 మంది గాయాల పాలయ్యారు. మృతిచెందిన వారిలో ఆరుగురు సాధారణ పౌరులు, ముగ్గురు భద్రతా దళ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది.
Also read : Manipur Violence: మణిపూర్‌లో మరో ముగ్గురు మృతి.. భద్రతా సిబ్బంది వేషంలో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు
సోమాలియా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటలకు హోటల్ ముట్టడి (Somalia Hotel Siege) ప్రారంభమైంది. ఏడుగురు ఉగ్రవాదులు వచ్చి హోటల్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భద్రతా దళాలు రంగంలోకి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టాయి. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. మహిళలు, పిల్లలు, వృద్ధులతో సహా 84 మందిని భద్రతా దళాలు రక్షించాయి. 2022 ఆగస్ట్ లోనూ మొగదిషులోని ఒక హోటల్ ను అల్ షబాబ్ ఉగ్రవాదులు 30 గంటల పాటు ముట్టడించారు. అప్పట్లో ఆ ఘటనలో 21 మంది మరణించగా, 117 మంది గాయపడ్డారు.