HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Social Media Abuzz With Rumour Of Coup In Beijing Against Xi Jinping

Military Coup in China: “జిన్‌పింగ్‌ పై చైనా ఆర్మీ తిరుగుబాటు” అంటూ సోషల్ మీడియాలో వదంతుల వెల్లువ!!

శాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఉజ్బెకిస్థాన్ కు జిన్ పింగ్ వెళ్ళగానే .. ఆయనకి వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తీర్మానం చేసిందా?

  • By Hashtag U Published Date - 10:00 AM, Sun - 25 September 22
  • daily-hunt
China
China

సోషల్ మీడియా వేదికగా చైనా
అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కు సంబంధించి తీరొక్క ప్రచారం జరుగుతోంది.

చైనా లో ఏదైనా జరిగిందా ?

అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను సైన్యం హౌజ్ అరెస్టు చేసిందా?

కమ్యూనిస్టు పార్టీలో తిరుగుబాటు
జరిగిందా?

శాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఉజ్బెకిస్థాన్ కు జిన్ పింగ్ వెళ్ళగానే .. ఆయనకి వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తీర్మానం చేసిందా?

ఇందులో భాగంగానే శాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ మీటింగ్ నుంచి రాగానే జిన్ పింగ్ ను సైన్యం హౌజ్ అరెస్ట్ చేసిందా? అనే దానిపై ట్విట్టర్ వేదికగా హాట్ డిబేట్ జరుగుతోంది. ఇవన్నీ వాస్తవాలు కాదు.. వదంతులే. ఈ డిబేట్ లో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కూడా యాక్టివ్ గా పాల్గొంటు న్నారు. ఇదే టాపిక్ పై తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. అంతర్జాతీయ మీడియాలో కూడా ఇదే టాపిక్ పై వార్తలు వస్తున్నాయి.

బీజింగ్ వైపు 50వేల ఆర్మీ..

జిన్ పింగ్ పై తిరుగుబాటు లో భాగంగానే వేలాది మంది చైనా సైన్యం రాజధాని బీజింగ్ దిశగా వెళుతోంది. బీజింగ్ వైపు  50 వేల మంది పీపీఏ సైన్యం వెళుతుందని. బీజింగ్ దారిలో కిలోమీటర్ల మేర సైన్యం వాహనాలే కన్పిస్తున్నాయని కథనాలు వస్తున్నాయి.

పార్టీలో తిరుగుబాటు..?

చైనా అధ్యక్షుడిగా ప్రస్తుతం జిన్ పింగ్ ఉన్నారు. చైనాకు జీవిత కాల అధ్యక్షుడిగా జిన్ పింగ్ ను ప్రకటించారు. జిన్ పింగ్ నియంతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కొన్ని రోజులుగా వస్తున్నాయి.పైకి నవ్వుతూ కనిపించే జిన్ పింగ్.. చాలా క్రూరంగా ఆలోచిస్తారని అంటారు. ఆయన నియంత పోకడలు పెరగడంతో కమ్యూనిస్టు పార్టీలో తిరుగుబాటు వచ్చిందని తెలుస్తోంది. చైనాకు కాబోయే కొత్త అధ్యక్షుడు జనరల్ లీ కయోమింగ్ అంటు వార్తలు వైరల్ గా మారాయి.  ఈ వార్తలపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.

ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్షతో..

అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైనా వదిలిపెట్టేలా లేదు చైనా. తాజాగా రెండు రోజుల వ్యవధిలో అవినీతికి పాల్పడిని ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్ష విధించారు. అవినీతి అధికారులు, రాజకీయ నాయకులపై జిన్ పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాను మించి సూపర్ పవర్ గా ఎదగాలని భావిస్తున్న జిన్ పింగ్.. 2012 నుంచి అధికారం చేపట్టిన తర్వాత నుంచి అవినీతిని సహించడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు చైనా అధ్యక్షుడిగా పనిచేసిన జిన్ పింగ్ మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని మెజారిటీ నాయకులు కూడా జిన్ పింగ్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పటివరకు చైనాకు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా కేవలం రెండుసార్లు మాత్రమే అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే జిన్ పింగ్ మాత్రం దీన్ని తిరగరాయబోతున్నారు.

రూ. 750 కోట్లకు పైగా అవినీతి..

ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడిన ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్షలను ఖరారు చేశాయి అక్కడి కోర్టులు. లంచం తీసుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్లలో అవకతవకలు, భారీగా లంచాలు తీసుకోవడం, అక్రమ ఆయుధాలను కలిగి ఉన్న నేరం కింద చైనా మాజీ ప్రజా భద్రత ఉపమంత్రి సన్ లిజున్ కు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించింది కోర్టు. 2001 నుంచి 2020 వరకు వివిధ పదవులను నిర్వమించిన సన్ లిజున్ మొత్తం రూ. 750 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు కోర్టు విచారణలో తేలింది.17.3 మిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడిన మాజీ న్యాయశాఖ మంత్రి ఫు జెంగ్‌హువాకు, అత్యంత శక్తివంతమైన పోలీస్ చీఫ్ లలో ఒకరైనా ఫు జెంఘువా కు కోర్టు మరణశిక్ష విధించింది. కొన్ని గంటల వ్యవధిలో మాజీ జియాంగ్సు అధికారి వాంగ్ లైక్ కి కూడా మరణశిక్ష విధించింది. మాజీ మంత్రి సన్ లిజున్, అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు మద్దతుదారుగా ఉన్నారు. అయినా కూడా.. అవినీతి కేసుల్లో ఆయన తప్పించుకోలేకపోయారు.

New rumour to be checked out: Is Xi jingping under house arrest in Beijing ? When Xi was in Samarkand recently, the leaders of the Chinese Communist Party were supposed to have removed Xi from the Party’s in-charge of Army. Then House arrest followed. So goes the rumour.

— Subramanian Swamy (@Swamy39) September 24, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • China coup
  • Chinese President XI Jinping
  • Xi Jingping house arrest

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd