Singapore : సింగపూర్ లో పాట పాడితే జైలుకే..!! ఇంకెన్ని రూల్స్ ఉన్నాయో తెలుసా…?
Singapore : పబ్లిక్ ప్లేసెస్‌లో సిగరెట్ తాగడాన్ని కఠినంగా నిషేధించిన సింగపూర్ ప్రభుత్వం, సీసీ కెమెరాల ఆధారంగా నిబంధనల ఉల్లంఘన గుర్తించి ఫైన్ వేస్తోంది
- By Sudheer Published Date - 10:05 AM, Sat - 26 July 25

ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఆసియా దేశాల్లో సింగపూర్ (Singapore ) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ చిన్న ద్వీప దేశం ఆచరణాత్మక పాలన, నిబంధనల పటిష్ఠ అమలు(Singapore Rules)తో అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. మలయ్, చైనీస్, భారతీయ, పాశ్చాత్య సంస్కృతుల సమ్మేళనంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ నగరం.. తక్కువ విస్తీర్ణంలో ఉన్నా అత్యంత శుభ్రత, క్రమశిక్షణతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా నివాసానికి అనువైన నగరాలలో ఇది ఒకటిగా నిలిచింది.
అయితే సింగపూర్‌లో కొన్ని నియమాలు ఇతర దేశాలవారికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఉదాహరణకు బహిరంగంగా పాటలు పాడితే అరెస్టు చేసి మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనితో పాటు పావురాలకు ఆహారం వేయడాన్ని నిషేధించారు, ఎందుకంటే అవి వ్యాధులు వ్యాప్తి చేసే అవకాశం ఉండటమే కాదు.. శుభ్రతకు భంగం కలిగిస్తాయి. ఇలా చిన్న విషయాలను కూడా నియంత్రించే నిబంధనలు ఉన్నప్పటికీ, అవి సమాజం శుభ్రంగా, సురక్షితంగా ఉండేందుకు తోడ్పడతాయి.
Kadapa : జగన్ అడ్డాలో కమలం కసరత్తులు
సింగపూర్‌లో ప్రైవేటు వైఫై వాడినందుకు 3 సంవత్సరాల జైలు లేదా భారీ జరిమానా విధించే చట్టం ఉంది. అలాగే పబ్లిక్ వాష్‌రూమ్‌లో ఫ్లష్ చేయకపోతే కూడా ఫైన్ వేస్తారు. ఇక్కడి ప్రజలు తమ వ్యక్తిగత బాధ్యతగా శుభ్రతను తీసుకుంటారు. ఇంట్లో నగ్నంగా తిరిగినా $1000 ఫైన్ ఉండటం విన్నప్పుడే చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ దీనివెనక ఉన్న ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది . పబ్లిక్ మోరాలిటీని, ప్రైవసీని కాపాడడం.
అంతేకాకుండా పబ్లిక్ ప్లేసెస్‌లో సిగరెట్ తాగడాన్ని కఠినంగా నిషేధించిన సింగపూర్ ప్రభుత్వం, సీసీ కెమెరాల ఆధారంగా నిబంధనల ఉల్లంఘన గుర్తించి ఫైన్ వేస్తోంది. బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత, ప్రజారోగ్యానికి భంగం కలిగించే అలవాట్లపై ఈ దేశం అస్సలు మినహాయింపులు ఇవ్వదు. ఈ కఠిన నియమాలే ప్రజలను పద్ధతిగా జీవించేలా చేస్తూ.. దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి. మన దేశంలోనూ ఇటువంటి బాధ్యతాభారిత జీవనశైలి అభివృద్ధి చెందితే.. మనం కూడా శుభ్రత, క్రమశిక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవగలుగుతాం.
Thailand : థాయ్‌లాండ్ వెళ్లే భారతీయులకు హెచ్చరిక