Hamas Bunkers : గ్రౌండ్ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ దూకుడు.. వీడియో వైరల్
Hamas Bunkers : ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ పాలించే గాజా ప్రాంతంలోకి చొచ్చుకుపోతోంది. గ్రౌండ్ ఆపరేషన్ లోనూ దూసుకుపోతోంది.
- By Pasha Published Date - 12:33 PM, Fri - 13 October 23
Hamas Bunkers : ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ పాలించే గాజా ప్రాంతంలోకి చొచ్చుకుపోతోంది. గ్రౌండ్ ఆపరేషన్ లోనూ దూసుకుపోతోంది. గాజా సరిహద్దు ప్రాంతాల్లో హమాస్ ఉగ్రవాదులు నిర్మించుకున్న సొరంగాలను ఇజ్రాయెల్ ఆర్మీ జల్లెడ పడుతోంది. వాటిలో నక్కి ఉన్న హమాస్ మిలిటెంట్ల ఏరిపారేస్తోంది. తాజాగా గురువారం రోజు ఇజ్రాయెలీ ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి, హమాస్ సొరంగాల్లోని ఎంతోమంది బందీలను విడిపించింది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రహస్య బంకర్లలో దాక్కున్న మిలిటెంట్ల ఏరివేతకు సంబంధించిన సీన్లు ఆ వీడియోలో ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ దాడిలో దాదాపు 60 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని , డజన్లకొద్దీ బందీలను విడిపించామని ఇజ్రాయెలీ ఆర్మీ అంటోంది. తాము అదుపులోకి తీసుకున్న మిలిటెంట్లలో హమాస్ సౌత్ డివిజన్ కమాండర్ కూడా ఉన్నాడని వెల్లడించింది. తుపాకీ కాల్పులు, గ్రెనేడ్ దాడులకు భయపడకుండా ఇజ్రాయెల్ ఆర్మీ నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ‘‘ఎటాక్ నౌ’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ కమాండర్ ఆర్డర్ ఇవ్వడం.. ఓ సైనికుడు ముందుకు దూసుకెళ్లి లైన్ క్లియర్ చేయడం.. ‘‘గన్ గురి పెట్టండి’’ అని ఇంకో సైనికుడు అరవడాన్ని మనం ఈ వీడియోలో (Hamas Bunkers) స్పష్టంగా చూడొచ్చు.
״שייטת, שייטת, תישארו בבונקר, אנחנו באים!״ לוחמי שייטת 13 בקרב על מוצב סופה
כוחות יחידת שייטת 13 בסדיר ובמילואים הוזנקו במסוקים תוך זמן קצר עם הגעת הדיווחים על החדירה בגבול עזה בשבת בבוקר וחברו לכוחות הלוחמים בשטח למאמץ משותף.
הכוחות החלו בלחימה ביישובי העוטף ובים במקביל>> pic.twitter.com/dSQTqqj2yr— צבא ההגנה לישראל (@idfonline) October 12, 2023
Also Read: Venkaiah Naidu : ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు
Related News
Israeli Soldiers: దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్ దళాలు (Israeli Soldiers) గాజాలో రెండు నెలలకు పైగా పోరాడుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ చాలా నష్టపోయింది.