HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Putin Critic Alexei Navalny 47 Dies In Arctic Circle Jail

Alexei Navalny : జైలులో పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి నావల్నీ మృతి.. ఏం జరిగింది ?

Alexei Navalny :  రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి 47 ఏళ్ల అలెక్సీ నావల్నీ ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.

  • Author : Pasha Date : 16-02-2024 - 8:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Navalny
Navalny

Alexei Navalny :  రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి 47 ఏళ్ల అలెక్సీ నావల్నీ ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. రష్యా బార్డర్‌లోని ఉత్తర సైబీరియా ప్రాంతంలో ఉన్న ఆర్కిటిక్ జైలు ప్రాంగణంలో ఇవాళ మార్నింగ్ వాక్‌కు వెళ్లిన నావల్నీ స్పృహ కోల్పోయారు. దీన్ని గమనించిన జైలు సిబ్బంది హుటాహుటిన ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నావల్నీ చనిపోయారని ఆస్పత్రిలోని డాక్టర్లు వెల్లడించారు. నావల్నీ మరణానికి గల కారణాలను గుర్తించడంపై ఇన్వెస్టిగేటివ్ పోలీసులు ఫోకస్ పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join

రష్యాలోని పుతిన్ సర్కారు ఎన్నో కేసులను నావల్నీపై బనాయించింది. దేశానికి వ్యతిరేకంగా నావల్నీ కుట్రలు చేస్తున్నారనే అభియోగాలను ఆయనపై మోపింది. ఈ కేసుల్లో నావల్నీకి గతంలో 19 ఏళ్ల జైలు శిక్షపడింది. దీంతో ఆయన కొన్నేళ్ల పాటు రష్యా నుంచి వెళ్లిపోయి వివిధ దేశాల్లో ప్రవాసంలో గడిపారు. అక్కడే ఉంటూ పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా విమర్శలు చేశారు. పుతిన్ సర్కారు అవినీతికి సంబంధించిన ఎన్నో వివరాలను వెలుగులోకి తెచ్చారు.

Also Read :Facial Razor Using Tips: అమ్మాయిలు ఫేస్ షేవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే గాయాలు తప్పవు?

ఈనేపథ్యంలో 2021 సంవత్సరంలో నావల్నీ జర్మనీ నుంచి రష్యాకు తిరిగొచ్చిన వెంటనే పుతిన్ అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. జైలులో ఉండగా నొవిచోక్ అనే ప్రమాదకర విషాన్ని నావల్నీపై ప్రయోగించగా.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనేపథ్యంలో గతేడాది నావల్నీని ఆర్కిటిక్ ప్రాంతంలోని ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీకి తరలించారు. దీనికి రష్యా దేశంలోనే అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేసే జైలుగా పేరుంది. ఈ జైలుకు పంపించి కనీసం ఏడాదైనా గడవకముందే అలెక్సీ నావల్నీ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

Also Read :  Bandi Sanjay : 8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alexei Navalny
  • Arctic Circle jail
  • putin
  • Putin critic

Related News

Russia Delivering Drones iran

Putin: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన పుతిన్.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..

Russia Iran Relations  అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను

    Latest News

    • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

    • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

    • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    Trending News

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd