HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Pm Modis Longest Foreign Trip In 10 Years Begins Tomorrow

PM Modi : మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటన

PM Modi : ఈ పర్యటన ద్వారా రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి ముందుకు సాగుతున్నారు

  • By Sudheer Published Date - 08:35 AM, Tue - 1 July 25
  • daily-hunt
PM Modi
PM Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి ముందుకు సాగుతున్నారు. విదేశాంగ శాఖ ప్రకారం, ఇది దశాబ్దాల తర్వాత భారత ప్రధాని చేసే కీలక పర్యటనగా చెప్పవచ్చు. పర్యటన తొలి దశలో మోదీ జూలై 2, 3 తేదీల్లో ఆఫ్రికా ఖండంలోని ఘనాలో పర్యటించనున్నారు. అక్కడి అధ్యక్షుడితో కలిసి ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై చర్చిస్తారు.

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్ మంజూరు

జూలై 3, 4 తేదీల్లో ప్రధాని కరేబియన్ ప్రాంతంలోని ట్రినిడాడ్ అండ్ టొబాగోను సందర్శిస్తారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే తొలిసారి. భారత సంతతికి చెందిన వారు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో, ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. అనంతరం జూలై 4, 5 తేదీల్లో ప్రధాని అర్జెంటీనాలో పర్యటిస్తారు. అక్కడి అధ్యక్షుడు జేవియర్ మిలేతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తారు.

Richest Temples: భారతదేశంలో అత్యంత ధనవంతమైన దేవాలయాలీవే!

జూలై 5 నుంచి 8 వరకు ప్రధాని మోదీ బ్రెజిల్‌ను సందర్శించి, రియో డి జనీరోలో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రపంచ పాలనా సంస్కరణలు, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై కీలకోపన్యాసం చేయనున్నారు. పలుదేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశముంది. చివరగా, జులై 9న నమీబియాకు వెళ్లి ఆ దేశాధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, నమీబియా పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ పర్యటనతో గ్లోబల్ సౌత్ దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 years begins
  • 5 countries in 8 days
  • pm modi
  • PM Modi Foreign tour
  • PM Modi’s longest foreign trip

Related News

Sardar Vallabhbhai Patel

Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!

ఈ సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక ఉత్సవం, పోలీసు, పారామిలిటరీ బలగాలచే జాతీయ ఐక్యతా దినోత్సవ కవాతు (నేషనల్ యూనిటీ డే పరేడ్) నిర్వహించబడింది.

  • Ranjana Prakash Desai

    Ranjana Prakash Desai: 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌.. జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యంలో కమిషన్!

  • CM Chandrababu

    CM Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోదీ ఫోన్‌!

  • Pm Modi In Bihar

    PM Modi: ప్రధాని మోదీ: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది!

Latest News

  • Heavy Rains : ఏపీకి బిగ్ షాక్ ..నవంబర్ లో మరో మూడు తుఫాన్లు..!!

  • Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు

  • Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగ అవకాశాలు

  • Salman Meets CM Revanth : సీఎం రేవంత్ తో సల్మాన్ ఖాన్ భేటీ

  • Deepfake : ‘డీప్ ఫేక్’పై చట్టాలు తీసుకురావాలి – చిరంజీవి

Trending News

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

    • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

    • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd