Papua New Guinea: మోదీ పాదాలు తాకిన పాపువా న్యూ గినియా ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ఘనస్వాగతం పలికారు.
- Author : Praveen Aluthuru
Date : 21-05-2023 - 6:42 IST
Published By : Hashtagu Telugu Desk
Papua New Guinea: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పాపువా న్యూ గినియా (Papua New Guinea) ప్రధాని జేమ్స్ మరాపే ( James Marape) ఘనస్వాగతం పలికారు. దీంతో పాటు ప్రధాని మోదీ పాదాలను కూడా తాకారు.
జేమ్స్ మరాపే పాదాలకు దండం పెడుతుండగా మోడీ (PM Modi) అడ్డుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక దేశ ప్రధాని ఇతర దేశ ప్రధాని పాదాలని తాకడం అంటే ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే కేవలం తన ప్రేమను వ్యక్తపరిచేందుకే ఇలా చేశాడని వీడియో చూస్తే అర్ధం అవుతుంది.
#WATCH | Prime Minister of Papua New Guinea James Marape seeks blessings of Prime Minister Narendra Modi upon latter's arrival in Papua New Guinea. pic.twitter.com/gteYoE9QOm
— ANI (@ANI) May 21, 2023
విశేషం ఏంటంటే పాపువా న్యూ గినియాను సందర్శించిన భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ప్రధాని మోదీ. ప్రధాని మోదీ హిరోషిమాలో పలువురు ప్రముఖ ప్రపంచ నాయకులను కలుసుకున్నారు. ఈ భేటీలో మోడీ ప్రపంచ సమస్యలపై వారితో చర్చలు జరిపారు. అనంతరం పపువా న్యూగినియాకు బయల్దేరిన ప్రధాని మోదీ అక్కడ ఆయనకు పాపువా న్యూగినియా ప్రధాని ఘనంగా స్వాగతం పలికారు. G7 (G7 Sammit) సభ్య దేశాలలో US, ఫ్రాన్స్, UK, ఇటలీ, జర్మనీ, కెనడా మరియు జపాన్ ఉన్నాయి.
Read More: MI vs SRH: ఐపీఎల్ మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టిన వివ్రాంత్ శర్మ