Gaza : గాజాలో 64వేలు దాటిన మరణాలు
Gaza : ఈ యుద్ధం వల్ల గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు లేకుండా నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రజలు భయం, ఆందోళనతో గడుపుతున్నారు
- By Sudheer Published Date - 11:50 AM, Fri - 5 September 25

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ (Israel and Hamas) మధ్య జరుగుతున్న యుద్ధంలో మృతుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 64,000 మందికి పైగా ప్రాణాలు (passes 64,000) కోల్పోయినట్లు గాజా అధికారులు (health officials) వెల్లడించారు. ఈ మృతులలో ఎక్కువ మంది అమాయక పౌరులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. నిన్న జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
HYD Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది – హరీష్ రావు
గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తే 48 మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రతిపాదన చేసింది. అయితే, ఇజ్రాయెల్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. హమాస్‌ను యుద్ధంలో ఓడించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం 2023 నుంచి కొనసాగుతోంది.
ఈ యుద్ధం వల్ల గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు లేకుండా నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రజలు భయం, ఆందోళనతో గడుపుతున్నారు. ప్రపంచ దేశాలు శాంతి స్థాపనకు కృషి చేస్తున్నప్పటికీ, ఇరు వర్గాలు సయోధ్యకు రాకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. తక్షణ కాల్పుల విరమణ, మానవతా సహాయం అందించడం అత్యవసరం అని అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి.