HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >North Korea Says It Has Tested Another Underwater Nuclear Drone

Underwater Nuclear Drone : సముద్ర గర్భ అణ్వాయుధ డ్రోన్ పరీక్ష.. కిమ్ దూకుడు

Underwater Nuclear Drone : దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలకు ఉత్తర కొరియా మరోసారి ఛాలెంజ్ విసిరింది.

  • By Pasha Published Date - 12:08 PM, Fri - 19 January 24
  • daily-hunt
Underwater Nuclear Drone
Underwater Nuclear Drone

Underwater Nuclear Drone : దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలకు ఉత్తర కొరియా మరోసారి ఛాలెంజ్ విసిరింది. యుద్ధానికి సిద్ధం అనేలా మరో సంకేతాన్ని పంపింది. తాజాగా ఉత్తర కొరియా దేశం అణుసామర్థ్యం కలిగిన సముద్రగర్భ డ్రోన్​ను టెస్ట్ చేసింది. అమెరికా, జపాన్ సైన్యాల జాయింట్ మిలిటరీ డ్రిల్‌కు ప్రతిస్పందనగా ఈ పరీక్షలను చేసింది.ఈవిషయాన్ని ఉత్తర కొరియా మిలిటరీ శుక్రవారం ప్రకటించింది. ‘‘అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్‌వాటర్‌ డ్రోన్‌ను టెస్ట్ చేశాం. ఇది సముద్ర గర్భంలో తిరుగుతూ శత్రువుల కదలికలను పసిగట్టి ఎటాక్ చేస్తుంది. అమెరికా, దాని మిత్రదేశాలను నిలువరించడానికి మా  ప్రతిచర్యలు ఇలాగే కొనసాగుతాయి’’ అని ఉత్తర కొరియా సైన్యం స్పష్టం చేసింది. తమ దేశంలో సూదిమొనంత స్థలాన్ని ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

  • అణ్వాయుధ సామర్థ్యం కలిగిన డ్రోన్​ను(Underwater Nuclear Drone) ఉత్తర కొరియా గతేడాది పరీక్షించింది.
  • ‘హెయిల్‌’ పేరుతో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన డ్రోన్​ను గతేడాది మార్చి నుంచి  పరీక్షిస్తోంది.
  • ప్రత్యర్థుల నౌకలు, ఓడరేవులే లక్ష్యంగా రూపొందించిన ఈ డ్రోన్‌లను తీరం నుంచి కూడా ప్రయోగించే వీలు ఉంది.
  • ఉత్తరకొరియా న్యూక్లియర్‌ బాలిస్టిక్‌ క్షిపణుల కంటే ఇవి తక్కువ సామర్థ్యం కలిగినవే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Pannun Warning : సీఎం యోగిని చంపేస్తాం.. 22న అయోధ్యలో ఎటాక్ తప్పదు : పన్నూ

కిమ్ జోంగ్ ఉన్‌ వారసురాలు ఆమేనట.. 

ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్‌ వారసత్వాన్ని కొనసాగించేదెవరో గుర్తించామని దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ తెలిపింది. ఆయనతోపాటు మిలటరీ పరేడ్, మిసైల్ లాంఛ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్న కుమార్తె ఆయన వారసురాలయ్యే అవకాశాలు ఉన్నాయని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ తెలిపింది. కిమ్ తరువాత ఆయన చిన్న కుమార్తె కిమ్ జు యే వారసురాలు కానుందని దక్షిణ కొరియా జాతీయ ఇంటెలిజెన్స్ సర్వీస్ ధ్రువీకరించింది. అయితే, ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉందని, దాదాపుగా ఆమె పేరే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. 2022లో మొదటిసారిగా కిమ్ జు యే పేరు బయటకు వచ్చింది. ఆమె ప్రజల ముందుకు వచ్చింది. “ఆమె తొలిసారి ప్రజల మధ్యకు వచ్చినప్పటి నుంచి, ప్రజా కార్యక్రమాలు, కార్యకలాపాల సమగ్ర విశ్లేషణ ఆధారంగా, కిమ్ జు యే వారసురాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని ఎన్ఐఎస్ పేర్కొంది. “ఇతర సాధ్యాసాధ్యాల గురించి కూడా విశ్లేషణలు జరుపుతున్నాం. ఎందుకంటే కిమ్ జోంగ్ ఉన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆయన వయసు కూడా తక్కువే. ఇంకేమైనా జరగొచ్చు” అని తెలిపింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • new nuclear missile
  • north korea
  • Underwater Nuclear Drone

Related News

Putin- Kim Jong

Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.

  • Kim with daughter in China.. Are signs of succession becoming clear?

    Military Day Parade : చైనాలో కుమార్తెతో కిమ్‌..వారసత్వ సంకేతాలు స్పష్టమవుతున్నాయా?

  • Kim to China on bulletproof train.. a strong signal to America

    Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్‌ రైలులో చైనాకు కిమ్‌.. అమెరికాకు బలమైన సంకేతం

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd