Miss Universe 2023 : మిస్ యూనివర్స్‌గా నికరాగ్వా బ్యూటీ.. ఇండియా, పాక్ నుంచి కూడా ?
Miss Universe 2023 : ‘మిస్ యూనివర్స్ 2023’ పీఠం నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్‌ను వరించింది.
- By Pasha Published Date - 11:57 AM, Sun - 19 November 23
Miss Universe 2023 : ‘మిస్ యూనివర్స్ 2023’ పీఠం నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్‌ను వరించింది. దీంతో 72వ మిస్ యూనివర్స్ కిరీటం ఆమె వశమైంది. విజేతగా ఆమె పేరును ప్రకటించగానే.. షెన్నిస్ పలాసియోస్ భావోద్వేగానికి లోనయ్యారు. 2022 సంవత్సరంలో మిస్ యూనివర్స్‌గా ఎంపికైన ఆర్ బోనీ షెన్నిస్ ఈసందర్భంగా పలాసియోస్ తలపై మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. కిరీటం ధరించిన తర్వాత పలాసియోస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. నికరాగ్వా నుంచి మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి మహిళగా ఆమె రికార్డును సొంతం చేసుకున్నారు. ఈసారి మిస్ యూనివర్స్ పోటీల్లో రెండో స్థానంలో ఆంటోనియా పోర్సిల్డ్ (థాయ్ లాండ్), మూడో స్థానంలో మొరయా విల్సన్ (ఆస్ట్రేలియా) నిలిచారు. ఈసారి ఎల్ సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్ వేదికగా‘మిస్ యూనివర్స్’ పోటీలు జరిగాయి. ఇందులో 84 దేశాలకు చెందిన బ్యూటీలు కిరీటం కోసం పోటీపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m
— Miss Universe (@MissUniverse) November 19, 2023
భారత్, పాక్ నుంచి కూడా..
భారత్‌లోని చండీగఢ్ నగరానికి చెందిన శ్వేతా శారద కూడా మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్నారు. టాప్ 20 ఫైనలిస్టులలో ఆమె స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ సంవత్సరం తొలిసారిగా పాకిస్తాన్ నుంచి కూడా ఒక యువతి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు. అయితే మొత్తం 83 మంది బ్యూటీలను అధిగమించిన నికరాగ్వా బ్యూటీ షెన్నిస్ పలాసియోస్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాదికి మిస్ యూనివర్స్‌గా(Miss Universe 2023) ఆమె నిలిచారు.