YouTube: యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే డబ్బులు.. వెలుగులోకి కొత్త తరహా సైబర్ మోసం
ఏటీఎం పాస్వర్డ్, పాన్ కార్డు అప్డేట్ అంటూ ఓటీపీ చెప్పమని ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు అకౌంట్లోని డబ్బులను ఖాళీ చేయడం లాంటిివి కామన్ అయిపోయారు.
- By Nakshatra Published Date - 09:32 PM, Sun - 2 April 23
YouTube: ఏటీఎం పాస్వర్డ్, పాన్ కార్డు అప్డేట్ అంటూ ఓటీపీ చెప్పమని ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు అకౌంట్లోని డబ్బులను ఖాళీ చేయడం లాంటిివి కామన్ అయిపోయారు. వీటి గురించి ప్రజలకు బ్యాంకులు అవగాహన పెంచడంతో చాలామంది జాగ్రత్తలు పడుతున్నారు. ప్రజలకు అవగాహన కలగడంతో సైబర్ నేరగాళ్ల కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొత్త తరహాలో ప్రజలను మోసం చేస్తున్నారు. అందినకాడికి డబ్బులు దొచుకుని పత్తా లేకుండా పోతున్నారు.
తాజాగా మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ నమ్మించి ఒక వ్యక్తి నుంచి ఏకంగా రూ.8.5 లక్షలు దొచుకున్నారు. యూట్యూబ్ లో వీడియోలను లైక్ చేస్తే డబ్బులు ఇస్తామంటూ నమ్మబలికారు. ఇందుకోసం డబ్బులు జమ చేయాలని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి ఇది నిజమనుకుని నమ్మి మోసపోయాడు. ఇప్పుడు లక్షల్లో డబ్బులు పొగోట్టుకున్న తర్వాత లబోదిబోమంటున్నాడు.
యూట్యూబ్‌లో వీడియోలకు లైక్ కొడితే డబ్బులు వస్తాయంటూ గురుగ్రామ్‌కు చెందిన సిమ్రన్ జీత్ సింగ్ నందా అనే వ్యక్తికి ఇటీవల వాట్సప్ లో మెస్సేజ్ వచ్చింది. తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే లైక్‌కు రూ.50 చెల్లిస్తామంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నగదు రిక్వెస్ట్ పంపారు. ఈ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత విడతల వారీగా రూ.8.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. దీంతో మెస్సేజ్ పంపిన వారిన సంప్రదించగా సమాధానం రాలేదు.
దీంతో మోసపోయినట్లు గ్రమించిన సిమ్రన్ జీత్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన వీడియోల ద్వారా మాల్ వేర్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Tags
Related News
Telugu Song : ఆ తెలుగు సాంగ్ హవా.. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ 20 కోట్ల వ్యూస్
Telugu Song : యూట్యూబ్.. ప్రతి ఒక్కరి ఫేవరేట్ సోషల్ మీడియా యాప్ !! దీనిపై మనకు ఎలాంటి డౌటూ ఉండాల్సిన అవసరం లేదు.