Koli Dog: రూ.12 లక్షలు ఖర్చు పెట్టి కుక్కలా మారిన వ్యక్తి.. ఇప్పుడు ఏం జరిగిందంటే?
మనుషుల ఆశలకు హద్దులు లేవు. ఈ రోజుల్లో తాము అనుకున్నట్లు జీవించడానికి చాలా మంది ఏవేవో చేస్తుంటారు.
- By Nakshatra Published Date - 10:18 PM, Fri - 30 December 22
Koli Dog: మనుషుల ఆశలకు హద్దులు లేవు. ఈ రోజుల్లో తాము అనుకున్నట్లు జీవించడానికి చాలా మంది ఏవేవో చేస్తుంటారు. అందులో కొందరు సక్సెస్ అవుతుంటారు. మరికొందరు సక్సెస్ కాలేరు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఓ మనిషి తనకు తన జన్మ నచ్చలేదని జంతువులా మారిపోయాడు. కుక్కలా మారిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
మనిషి కుక్కలా మారిన ఘటన జపాన్‌లో జరిగింది. ఓ వ్యక్తి అచ్చం కుక్కలా మారిపోయి దానిలాగే ప్రవర్తిస్తున్నాడు. అలా తాను కుక్కలా మారడానికి దాదాపు రూ.12 లక్షలకు పైగానే ఖర్చు కూడా చేశాడు. ఆ వ్యక్తి కుక్కలా మారాడు అనడం కన్నా కుక్కలా మరో అవతారం ఎత్తాడు అనడం ఎంతో మేలు. జపాన్ దేశానికి చెందిన టోకోకు నాలుగు కాళ్లున్న జంతువుగా మారిపోవాలని బలమైన కోరిక ఉండేది. అయితే కుక్క రూపమైతే తనకు సరిగ్గా సరిపోతుందని భావించుకుని ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క ‘కోలీ’గా మారిపోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాడు.
ఆ వ్యక్తి జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీని సంప్రదించి తాను కుక్కలా మారాలని అనుకున్నాడు. జపాన్‌లో ఈ సంస్థ పలు సినిమాలు, టీవీ షోలు, వినోదాత్మక కార్యక్రమాలకు కాస్ట్యూమ్స్, మస్కట్ పాత్రల దుస్తులను తయారు చేసి ఇస్తోంది. సుమారు రూ.12 లక్షలకు పైగా డబ్బులు ఖర్చు చేసి ఆ వ్యక్తి జాతి కుక్క ‘కోలీ’ కాస్ట్యూమ్‌ను కొన్నాడు. దాన్ని ధరించిన టోకో అచ్చం కుక్కలా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
కుక్కల మారడమే కాదు దానిలా హావాభావాలను ప్రదర్శిస్తూ సందడి చేశాడు. కుక్క మాదిరిగా నడిచేందుకు కూడా ప్రయత్నించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు కుక్కలా మారిన విధానం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
Related News
Japanese Man: 86 ఏళ్ల వయసులో రికార్డ్ బద్దలు కొట్టిన జపాన్ తాత..!
కలను నెరవేర్చుకునేందుకు వయసు అడ్డు కాదని జపాన్‌కు చెందిన 86 ఏళ్ల వృద్ధుడు మరోసారి నిరూపించారు.