Charles III is the King:లండన్ కొత్తరాజుగా ప్రమాణం చేసిన ఛార్లెస్-3
లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో అక్సెషన్ కౌన్సిల్ సమక్షాన కింగ్ ఛార్లెస్-3ను బ్రిటన్‌కు కొత్తరాజుగా రాజరికపు అధికారాలు కట్టబెట్టారు.
- By Hashtag U Published Date - 04:50 PM, Sat - 10 September 22

లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో అక్సెషన్ కౌన్సిల్ సమక్షాన కింగ్ ఛార్లెస్-3ను బ్రిటన్‌కు కొత్తరాజుగా రాజరికపు అధికారాలు కట్టబెట్టారు. గురువారం క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, యువరాజు ఛార్లెస్-3 రాజుగా బాధ్యతలు చేపట్టారు. 73 ఏళ్ల వయసులో ఈ పదవిని అలంకరించిన వ్యక్తిగా ఛార్లెస్ నూతన అధ్యాయం లిఖించారు. అయితే, ఇందుకు పెద్ద క్రతువే జరుగుతోంది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించారు. ‘రాణి అస్తమయంతో ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ ఇప్పుడు కొత్త రాజు (ఛార్లెస్-3) అయ్యారు’ అని కౌన్సిల్ ప్రకటించింది. ఈ సమయంలో ఆయన వెంట క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా, ఆయన కుమారుడు విలియం ఉన్నారు.
The King personally asked for television cameras to be allowed in the Accession Council.
King Charles III starts his reign as he means to go on.
A new transparent monarchy for a modern age. pic.twitter.com/8gMXYNW8un
— Charlie Proctor (@MonarchyUK) September 10, 2022