Kamala Harris : ఖాళీ పేజీలతో కమలా హ్యారిస్‌పై పుస్తకం.. అమెజాన్‌లో అదిరిపోయే స్పందన
‘ది అఛీవ్‌మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ పుస్తకాన్ని రచయిత జేసన్ డూడాస్ సెటైరికల్ స్టైల్‌లో(Kamala Harris) రాశారు.
- By Pasha Published Date - 12:53 PM, Mon - 7 October 24

Kamala Harris : కమలా హ్యారిస్‌పై అమెరికావాసి జేసన్ డూడాస్ రచించిన ‘ది అఛీవ్‌మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ పుస్తకం అమెజాన్‌లో భారీగా సేల్ అవుతోంది. దీని ధర రూ.1343. ప్రస్తుతం దీన్ని అమెజాన్ బెస్ట్ సెల్లర్ జాబితాలో చేర్చారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. అందుకే ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వారు పెద్దసంఖ్యలో ఈ బుక్‌ను కొంటున్నారు.
Also Read :Ola Shares : సోషల్ మీడియాలో కస్టమర్ల గోడు.. ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర డౌన్
- ‘ది అఛీవ్‌మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ పుస్తకాన్ని రచయిత జేసన్ డూడాస్ సెటైరికల్ స్టైల్‌లో(Kamala Harris) రాశారు.
- ఈ పుస్తకంలో తెల్ల కాగితాలే ఎక్కువగా ఉన్నాయి. బుక్‌లో అక్కడక్కడ కొన్ని అధ్యాయాల పేర్లు రాసినప్పటికీ, వాటికి సంబంధించిన వివరాలేం రాయలేదు.
- ఈ పుస్తకంలోని ఖాళీ పేజీలను చూపిస్తూ ఓ వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసిన వీడియోకు కేవలం ఏడున్నర గంటల్లో దాదాపు 21 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది ఈ వీడియో పోస్ట్‌ను రీపోస్టు చేశారు. అమెజాన్ యాప్‌లో ఈ పుస్తకంపై రీడర్స్ రాసిన సమీక్షల స్క్రీన్‌షాట్లను కూడా ఈ వీడియోలో చూపించడం విశేషం.
- గత 20 ఏళ్లుగా అమెరికా రాజకీయాల్లో కమలా హ్యారిస్ ఉన్నారు. తనపై కమల మద్దతుదారులు కేసులు వేస్తారనే భయంతోనే కొన్ని అధ్యాయాలకు సంబంధించిన ఖాళీ పేజీలను వదిలేశానని రచయిత జేసన్ డూడాస్ పుస్తకంలో పేర్కొనడం గమనార్హం.
- అయితే ఈ పుస్తకంలోని ఖాళీ పేజీలపై కొందరు నెటిజన్లు జోకులు పేలుస్తున్నాారు. ఖాళీ పేజీలను వదలడమే ఈ బుక్‌లో స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతున్నారు.
- కమలా హ్యారిస్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వల్లే ఈ బుక్ సేల్స్ జరుగుతున్నాయని పబ్లిషర్స్ చెబుతున్నారు.