Another Terrorist Killed in Pakistan : జైష్ టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ మృతి
Another Terrorist Killed in Pakistan : ముఖ్యంగా 'గజ్వా-ఎ-హింద్' ( 'Gazwa- e Hind' )అనే సిద్ధాంతం ఆధారంగా యువతలో జిహాది భావజాలాన్ని ప్రేరేపించేవాడు
- By Sudheer Published Date - 04:40 PM, Tue - 3 June 25

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అనుమానాస్పద మృతుల పరంపర కొనసాగుతోంది. ఇప్పుడు ఆ జాబితాలో జైష్-ఎ-మహ్మద్ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఎసార్ (Jaish-e-Mohammed, Maulana Abdul Aziz) పేరు కూడా చేరిపోయింది. పాకిస్తాన్ లోని భావల్పూర్లో మృతి(Dead )చెందినట్లు తెలుస్తోంది. అయితే అతని మృతి ఎందుకు, ఎలా జరిగింది అన్న విషయాలు ఇంకా స్పష్టత రాలేదు.
Pragya Jaiswal : కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్న బాలయ్య హీరోయిన్
అబ్దుల్ అజీజ్ భారత వ్యతిరేక ప్రసంగాలతో పేరుగాంచిన వ్యక్తి. ముఖ్యంగా ‘గజ్వా-ఎ-హింద్’ ( ‘Gazwa- e Hind’ )అనే సిద్ధాంతం ఆధారంగా యువతలో జిహాది భావజాలాన్ని ప్రేరేపించేవాడు. అతని ప్రసంగాలు జైష్ యొక్క సోషల్ మీడియా ఛానళ్లలో తరచూ వైరల్ అయ్యేవి. జూన్ 3న అతని అంత్యక్రియలు బహావల్‌పూర్లోని జైష్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడ్డాయి.
భారత్ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో జైష్ ప్రధాన కేంద్రంగా ఉన్న బహావల్‌పూర్‌పై ఎయిర్‌స్ట్రైక్ చేయబడింది. ఈ దాడి తర్వాత అబ్దుల్ అజీజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు, అనేక భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అతని అనుమానాస్పద మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది అంతర్గత ఘర్షణ ఫలితమా? లేక ఆపరేషన్ సిందూర్ ప్రభావమా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.