HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Fires Missiles At Pakistan Targets Balochi Group Bases

Iran Vs Pakistan : పాక్‌పైనా ఇరాన్ ఎటాక్.. మిస్సైల్స్, సూసైడ్ డ్రోన్స్‌తో ఉగ్ర స్థావరాలపై దాడి

Iran Vs Pakistan : పాకిస్తాన్‌‌పైనా ఇరాన్ మిస్సైల్ ఎటాక్ చేసింది.

  • Author : Pasha Date : 17-01-2024 - 7:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iran Strike
Iran Strike

Iran Vs Pakistan : పాకిస్తాన్‌‌పైనా ఇరాన్ మిస్సైల్ ఎటాక్ చేసింది. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌ కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థ జైష్ అల్ అద్ల్ యొక్క రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఇరాన్ ఆర్మీ క్షిపణులను సంధించింది. ఈమేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరాక్, సిరియాలలోని ఐసిస్ స్థావరాలు, ఇజ్రాయెలీ గూఢచర్య సంస్థ మోసాద్ కేంద్రంపై సోమవారం తెల్లవారుజామున ఇరాన్ ఆర్మీ బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. దాదాపు 1250 కిలోమీటర్ల దూరం నుంచి వాటిపైకి మిస్సైళ్లు వేసింది. ఈ దాడి చేసిన మరుసటి రోజే పాకిస్తాన్‌లోని బెలూచి తీవ్రవాద సంస్థ జైష్ అల్ అద్ల్ స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. ఈ స్థావరాలపైకి ఇరాన్ మిస్సైల్స్‌తో పాటు ఆత్మాహుతి డ్రోన్లు కూడా పడ్డాయని అంటున్నారు. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారని తెలుస్తోంది. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని, ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది.  ఇరాన్‌తోనూ పాకిస్తాన్‌ బార్డర్‌ను కలిగి ఉంది. ఇరాన్ బార్డర్‌లోనే పాకిస్తాన్‌కు చెందిన బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంటుంది.  ఆ బార్డర్ ఏరియాలో గతంలో ఇరాన్ భద్రతా బలగాలపైకి జైష్ అల్ అద్ల్ ఉగ్రవాదులు దాడి చేశారు. దానికి ప్రతీకారంగానే ఇప్పుడు ఇరాన్ ఎటాక్ చేసిందని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ దాడి వివరాలపై స్పందించేందుకు బెలూచిస్తాన్ ప్రావిన్స్ సమాచార మంత్రి జన్ అచక్జాయ్ నిరాకరించారు. దీనిపై పాక్ ఆర్మీయే(Iran Vs Pakistan) ప్రకటన చేస్తుందని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల తమ దేశంలో జరిగిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్‌ ఉత్తరప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోసాద్‌కు చెందిన ప్రధాన భవనంపై మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బాలిస్టిక్ మిస్సైళ్లతో  ఎటాక్ చేసింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు  తీవ్రంగా గాయపడ్డారు. దీంతో  మోసాద్‌కు చెందిన భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో నలుగురు మరణించారని కుర్దిస్తాన్ రీజినల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది. గాయపడ్డ ఆరుగురికి అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. మృతుల్లో అమెరికా అధికారులు గానీ, ఆ దేశ పౌరులు గానీ ఎవరూ లేరని వివరించింది. ఈ దాడిని అమెరికా విదేశాంగ  శాఖ ధృవీకరించింది. ఈ దాడి తీవ్రతను అంచనా వేస్తున్నామని, దీన్ని తిప్పి కొట్టక తప్పదని హెచ్చరించింది.

Also Read: Chiranjeevi : చిరంజీవి ఫైట్ కోసం.. 50వేలు ఖర్చు చేసి.. ఆరు వేల కుండలను..

ఈ దాడులకు తామే కారణమని ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దాడి చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.  ఎర్బిల్‌లోని మోసాద్ కేంద్రం.. తమ దేశానికి వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారిందని ఇరాన్ ఆర్మీ ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది.  మోసాద్ కేంద్రంపై దాడి అనంతరం ఇరాక్ ఇవాళ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇరాక్ భూభాగంపై దాడికి పాల్పడకూడదనే సెక్యూరిటీ అగ్రిమెంట్‌ను ఇరాన్ అధిగమించినట్టయిందని పేర్కొంది. దీని తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ(Iran Strike) హెచ్చరించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balochi Group Bases
  • Iran Missile Attack
  • Iran Strike
  • Iran Vs Pakistan

Related News

Iran's missile attacks on oil tankers in Hormuz

Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని రెండు క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటన

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd