Hijab Row In Iran: మహ్సా అమిని మరణంపై ఆగ్రహాజ్వాలలు…జుట్టు కత్తిరించుకుని మహిళల నిరసన..!!
ఇరాన్ లో హిజాబ్స్ ను వ్యతిరేకించినందుకు పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన 22ఏళ్ల మహ్సా అమినీకి ఆదేశ మహిళలు మద్దతుగా నిలిచారు.
- By hashtagu Published Date - 10:47 AM, Mon - 19 September 22

ఇరాన్ లో హిజాబ్స్ ను వ్యతిరేకించినందుకు పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన 22ఏళ్ల మహ్సా అమినీకి ఆదేశ మహిళలు మద్దతుగా నిలిచారు. దేశవ్యాప్తంగా జట్టు కత్తిరించుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ జర్నలిస్ట్ మసిహ్ అలినేజాద్ జుట్టు కత్తిరించే వీడియోనే తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. మహ్సా అమినీ హత్యకు నిరసనగా ఇరాన్ మహిళలు జట్టు కత్తిరించి…హిజాబ్ ను కాల్చి నిరసన తెలుపుతున్నారని ట్వీట్ చేశారు. ఏడేళ్లనుంచి బడికి వెళ్లలేమని..ఉద్యోగం చేయలేమని తాము వర్ణవివక్ష వ్యవస్థతో విసిగిపోయామంటూ చెప్పారు.
టెహ్రాన్ యూనివర్సిటీ నుంచి ఇరాన్ జర్నలిస్టు వీడియోను ట్వీట్ చేశారు. వందలాది మంది విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. కాగా నిన్న సగేజ్ నగరంలో నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయని ఇప్పుడు టెహ్రాన్ కూడా నిరసనలో చేరిందని పేర్కొన్నారు. అమినికి మద్దతుగా మహిళలందరూ వీధుల్లోకి వచ్చారు. మనమంతా ఐక్యంగా పోరాడాలంటూ పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై తమ స్వరాన్ని పెంచుతున్నారు.
అసలేం జరిగిందంటే?
22ఏళ్ల మహ్సా అమిని తన కుటుంబంతో ట్రెహాన్ పర్యటనలో ఉండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత అనుమానస్పద స్థితిలో అమినీ పోలీసుల కస్టడీలో మరణించింది. ఇరాన్ లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ బాలికలు,9ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న మహిళలు బహిరంగంగా హిజాబ్ ధరించడం తప్పనిసరి. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
https://twitter.com/AlinejadMasih/status/1571479790883946500?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1571479790883946500%7Ctwgr%5E0e3bb1e28e4b63b69235671c1b6f0fcded675c70%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fworld%2Fmiddle-east-hijab-row-in-iran-iranian-women-furious-over-mahsa-amini-death-protest-by-cutting-hair-watch-video-23081213.html