HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Gaza Rescuers Say 21 Killed In Israel Strike On Mosque

Israeli Attack : మసీదుపై ఇజ్రాయెల్ దాడిలో 21 మంది మృతి.. వైట్‌హౌస్ ఎదుట ఏమైందంటే ?

ఇజ్రాయెల్ పాశవిక దాడులను నిరసిస్తూ అమెరికాలో నిరసనలు(Israeli Attack) కొనసాగుతున్నాయి.

  • By Pasha Published Date - 10:40 AM, Sun - 6 October 24
  • daily-hunt
Israeli Attack Gaza Mosque Al Aqsa Martyrs Mosque

Israeli Attack : ఓ వైపు లెబనాన్..  మరోవైపు గాజా.. ఇంకో వైపు సిరియా.. మరొక వైపు యెమన్.. ఇలా ప్రతీచోట ఇజ్రాయెల్ ఆర్మీ దాడులతో విరుచుకుపడుతోంది. నలుమూలలా ఉన్న తన శత్రువులను ఇజ్రాయెల్ వెంటాడి మరీ అంతం చేస్తోంది. ఆయా చోట ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఇజ్రాయెలీ ఆర్మీ బూడిదకుప్పలుగా మారుస్తోంది. తాజాగా పాలస్తీనాలోని సెంట్రల్ గాజా ప్రాంతం దైర్ అల్ బలా వీధిలోని అల్ అక్సా మార్టైర్స్ ఆస్పత్రి వద్ద ఉండే మసీదుపై ఇజ్రాయెలీ ఆర్మీ యుద్ధ విమానాల నుంచి బాంబులు జార విడిచింది.

A self immolation attempt at the Washington DC anti Israel protest.
متظاهر يحاول إحراق نفسه في العاصمة واشنطن في مظاهرة ضد العدوان الاسرائيلي pic.twitter.com/zlrs1Booyt

— Tarek Abou Ghazala (@tarekmd) October 5, 2024

Also Read :Stuck At 6000 Metres : 3 రోజులు 6000 మీటర్ల ఎత్తులో.. మహిళా పర్వతారోహకులకు ఏమైందంటే ?

ఈ ఘటనలో ఆ మసీదులో తలదాచుకున్న సామాన్య ప్రజల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మసీదు ప్రాంగణమంతా రక్తసిక్తమైంది. బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మసీదులో మిన్నంటాయి. అయితే తాము సామాన్య ప్రజలను టార్గెట్ చేయలేదని.. మసీదులో దాక్కున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఇజ్రాయెలీ ఆర్మీ ప్రకటించింది. ఆ మసీదులోనే హమాస్ ఉగ్రవాదుల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందని ఆరోపించింది. గతంలోనూ పాలస్తీనాలోని మసీదులు, స్కూళ్లు, యూనివర్సిటీలు లక్ష్యంగా దాడులు చేసినప్పుడు ఇజ్రాయెల్ ఇదే విధమైన వివరణను విడుదల చేసింది.

Also Read :French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

ఇజ్రాయెల్ పాశవిక దాడులను నిరసిస్తూ అమెరికాలో నిరసనలు(Israeli Attack) కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాలోని వైట్ హౌస్ ఎదుట ఓ నిరసనకారుడు తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి తనకు తాను నిప్పు పెట్టుకున్నాడు. అనంతరం ఎడమ చేయి కాలిపోతుండటంతో సదరు యువకుడు అరుపులు పెడుతూ ఏడ్వడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.  దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు. నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. వెంటనే నిరసనకారుడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

Also Read :Maoists Encounter : మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Al Aqsa Martyrs Mosque
  • Anti Israel Protester
  • central Gaza
  • Gaza mosque
  • Israeli attack
  • Palestinians
  • white house

Related News

Shooting At The White House

White House Shooting : వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

White House Shooting : ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో లేరు. ఆయన అప్పటికే ఫ్లోరిడాలో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

    Latest News

    • ACE Unit : కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

    • Delhi Air Pollution: వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు..నగరం వదిలివెళ్లాల్సిందే !!

    • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

    • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd