Pakistan : ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన షూటర్ ఏం చెప్పాడో తెలుసా?
- By hashtagu Published Date - 08:55 PM, Thu - 3 November 22
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన వ్యక్తి సంచలన విషయాలను వెల్లడించాడు. దాడి సమయంలోనే పోలీసులకు చిక్కాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించాడు. అందుకే ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్స్ నిర్వహించాలన్న డిమాండ్ తో పొలిటికల్ ర్యాలీ చేపట్టారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చేపడుతుండగానే జనం మధ్యలో నుంకి దూసుకువచ్చిన ఓ దుండగుడు ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్ ఇమ్రాన్ ఖాన్ కాలీ తగలడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
అయితే తాను కేవలం ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు మాత్రమే వచ్చినట్లు తెలిపాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పాడు. లాహో్ నుంచి వచ్చిన తాను ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ ప్రారంభించిన రోజే తాను దాడికి ప్లాన్ చేసినట్లు చెప్పాడు. తనతో పాటు ఎవరు లేరని తానే ఒంటరిగానే ఈ ప్లాన్ చేసినట్లు చెప్పారు. దుకాణం వద్ద పార్క్ చేసిన బైక్ తీసుకుని ఒంటరిగా ర్యాలీకి వచ్చినట్లు వెల్లడించాడు. దాడికి పాల్పడిన వ్యక్తి పేరు ఫైసల్ భట్ అని పోలీసులు తెలిపారు.
Related News
Pakistan Man Killed Wife: పాకిస్థాన్లో దారుణం.. భార్య, పిల్లలను గొడ్డలితో నరికి హత్య
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఓ వ్యక్తి తన 7 మంది పిల్లలు, భార్యపై గొడ్డలితో దాడి చేసిన షాకింగ్ కేసు (Pakistan Man Killed Wife) పాకిస్థాన్ నుండి వెలుగులోకి వచ్చింది.