HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄World News
  • ⁄Devastating Flood In Pakistan Nasa Earth Observatory Comparative Photos Melting Himalayan Glaciers

Pakistan Floods: వరద గుప్పిట్లో పాక్.. జల ప్రళయాన్ని అద్దం పట్టేలా నాసా ఫోటోలు!!

పాకిస్థాన్ ను మునుపెన్నడూ లేనంత భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాలయాలు కరిగిపోయి..

  • By Hashtag U Published Date - 07:45 AM, Sun - 4 September 22
Pakistan Floods: వరద గుప్పిట్లో పాక్.. జల ప్రళయాన్ని అద్దం పట్టేలా  నాసా ఫోటోలు!!

పాకిస్థాన్ ను మునుపెన్నడూ లేనంత భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాలయాలు కరిగిపోయి..
సింధు నది పోటెత్తడంతో చాలా ప్రాంతం జలమయంగా మారింది. ఏకంగా వంద కిలోమీటర్ల వెడల్పున ఓ సరస్సులా మారిపోయింది. ఈ స్థితిని అద్దం పట్టేలా.. వరదలకు ముందు పాకిస్థాన్, వరదల తర్వాత పాకిస్థాన్ చిత్రాలను నాసా ఎర్త్ అబ్జర్వేటరీ తాజాగా విడుదల చేసింది. నాలుగు రోజుల కిందట నాసాకు చెందిన మోడిస్ శాటిలైట్ సెన్సర్ తో.. పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రానికి సంబంధించిన వరద చిత్రాలను తీశారు. ఇందులో ఆకుపచ్చ రంగులో ఉన్నవి అడవులు, పొలాలు కాగా.. గోధుమ రంగులో ఉన్నవి సాధారణ భూములు, ప్రాంతాలు. ఇక ముదురు నీలం రంగులో ఉన్నవన్నీ నీళ్లు.

* పాకిస్థాన్ లో అతి భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 100 కిలోమీటర్ల వెడల్పున, అంతకు మించిన పొడవుతో భారీ సరస్సులా ఏర్పడిందని నాసా వెల్లడించింది.

* వరదలకు సంబంధించి ఆగస్టు 4న, అదే నెల 28న తీసిన రెండు చిత్రాలను పోల్చుతూ నాసా విడుదల చేసింది. తొలి చిత్రంలో సింధ్ ప్రావిన్స్ సాధారణంగా ఉండగా.. రెండో చిత్రంలో నీట మునిగి కనిపిస్తుండటం గమనార్హం.

* పాకిస్థాన్ లో దాదాపు నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 30 ఏళ్ల వార్షిక సగటు కంటే ఏకంగా ఐదారు రెట్లు భారీగా వరదలు పోటెత్తడంతో 1,100 మందికిపైగా మరణించారు.

* సుమారు 3,500 కిలోమీటర్ల పొడవునా రోడ్లు కొట్టుకుపోగా.. 150 వంతెనలు దెబ్బతిన్నాయి.

* సింధూ నదికి వరదల వల్ల పాక్ లోని పలు పరీవాహక రాష్ట్రాలకు చెందిన దాదాపు 3.30 కోట్ల మంది ప్రభావితులు అయ్యారు. 10 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి.

* పాక్ లోని గిల్గీట్ బాల్టిస్తాన్ , ఖైబర్ పఖ్టున్ ఖా ప్రాంతాల్లో ప్రవహించే నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. దీంతో వరదలకు ముందు ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పరీవాహక ప్రాంతాల మ్యాప్ కాస్త.. వరదల తర్వాత నీలం రంగులోకి మారిపోవడాన్ని నాసా విడుదల చేసిన ఫోటోలో చూడొచ్చు.

* సింధు నదీ పరీవాహక ప్రాంతంలోని కంబర్, షికార్ పూర్ ప్రాంతాల్లో సగటు కంటే 500 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది.

Tags  

  • climate change
  • glaciers
  • pakistan flood

Related News

Glacier : బద్దలైన 10 ఫుట్‌బాల్ కోర్టుల సైజున్న గ్లేషియర్. వీడియోలో రికార్డ్ చేసిన  శాస్త్రవేత్తలు.

Glacier : బద్దలైన 10 ఫుట్‌బాల్ కోర్టుల సైజున్న గ్లేషియర్. వీడియోలో రికార్డ్ చేసిన శాస్త్రవేత్తలు.

అంతార్కిటికలో 10 ఫుట్ బాల్ ల వైశాల్యం ఉన్న గ్లేషియర్ బద్దలైపోయింది. అంటర్క్‌టికా పెనిన్సులాలో పరిశోధనలు నిర్వహిస్తున్న ఆర్ ఆర్ ఎస్ జేంస్ క్లార్క్ బృందం కళ్ళెదుటే గ్లేషియర్ బద్దలైంది. ఈ దృశ్యాలను టీం తమ కెమెరాలో బంధించారు. సముద్ర గర్భంలో అతిపెద్ద సునామీని సృష్టించగల శక్తి ఉన్న ఈ ఘటన .. అత్యంత తీవ్రత గల తరంగాలను సృష్టించి ఉండొచ్చని అంచన్నా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. జ

  • Winter Season: చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

    Winter Season: చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

  • Climate Crisis: మోగుతున్న ప్రమాద ఘంటికలు.. కరుగుతున్న మంచు ఫలకాలు.. అంతరిస్తున్న పగడపు దీవులు!!

    Climate Crisis: మోగుతున్న ప్రమాద ఘంటికలు.. కరుగుతున్న మంచు ఫలకాలు.. అంతరిస్తున్న పగడపు దీవులు!!

  • Pakistan Floods : “మొహంజోదారో” వరల్డ్  హెరిటేజ్ సైట్ జాబితా నుంచి ఔట్ అవుతుందా? ఎందుకు?

    Pakistan Floods : “మొహంజోదారో” వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితా నుంచి ఔట్ అవుతుందా? ఎందుకు?

  • Melting Himalayas: కరుగుతున్న హిమాలయాలు.. వణుకుతున్న పాక్.. ఎందుకు, ఏమిటి ?

    Melting Himalayas: కరుగుతున్న హిమాలయాలు.. వణుకుతున్న పాక్.. ఎందుకు, ఏమిటి ?

Latest News

  • China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

  • Rajinikanth: రోజూ మద్యం తాగే రజినీకాంత్.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి!

  • Tarakaratna: తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?

  • HR Job: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెఆర్ ఉద్యోగం ఊడింది!

  • Menopause : మెనోపాజ్ టైంలో తినాల్సిన బెస్ట్ ఫుడ్స్

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: