Dalai Lama: దలైలామా పునర్జన్మపై వివాదం మళ్లీ తెరపైకి
Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు 14వ దలైలామా పునర్జన్మ అంశం చైనా వ్యాఖ్యలతో మరోసారి వివాదాస్పదంగా మారింది.
- Author : Kavya Krishna
Date : 06-07-2025 - 4:16 IST
Published By : Hashtagu Telugu Desk
Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు 14వ దలైలామా పునర్జన్మ అంశం చైనా వ్యాఖ్యలతో మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో దలైలామాకు తుది అధికారం లేదని భారతదేశంలో చైనా రాయబారి జు ఫెయిహాంగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “లివింగ్ బుద్ధా”ల పునర్జన్మ 700 ఏళ్ల చరిత్ర కలిగిన సంప్రదాయమని, దీన్ని కొనసాగించాలా వద్దా అనేది దలైలామా నిర్ణయించలేరని ఆయన స్పష్టం చేశారు. చైనా చట్టాలు, మతపరమైన ఆచారాల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగాలనేది అధికారిక స్థానమని జు పేర్కొన్నారు.
Ponnam Prabhakar : రామచందర్ లేఖపై మంత్రి పొన్నం ఫైర్
ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, మత విశ్వాసాలు, సంప్రదాయాల విషయంలో భారత్ జోక్యం చేసుకోదని వెల్లడించారు. అయితే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం స్పష్టంగా — దలైలామా పునర్జన్మ నిర్ణయం పూర్తిగా బౌద్ధ మతపరమైన విషయమేనని, ఇతరుల జోక్యం అసహ్యం అని తేల్చిచెప్పారు. జూలై 6న దలైలామా 90వ పుట్టినరోజు జరుపుకుంటుండగా ఈ వివాదం మళ్లీ ఊపందుకోవడం గమనార్హం. టిబెట్ ప్రవాస ప్రభుత్వం చైనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. టిబెటన్ మత సంస్కృతిని నాశనం చేయడానికి చైనా “సాంస్కృతిక మారణహోమం” జరుపుతోందని టిబెట్ ప్రభుత్వం అధ్యక్షుడు పెన్పా త్సెరింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Useful Tips: ధోనీ లాగా కూల్‌గా ఎలా ఉండాలి? జీవితంలో ఎంతగానో ఉపయోగపడే చిట్కాలివే!