Twilight zone: సముద్ర జీవులపై వాతావరణ ప్రభావం
వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రత ప్రభావం లోతైన సముద్రంపై పడుతుంది. వాతావరణ మార్పుల ప్రభావంతో సముద్రపు ట్విలైట్ జోన్
- Author : Praveen Aluthuru
Date : 29-04-2023 - 7:22 IST
Published By : Hashtagu Telugu Desk
Twilight zone: వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రత ప్రభావం లోతైన సముద్రంపై పడుతుంది. వాతావరణ మార్పుల ప్రభావంతో సముద్రపు ట్విలైట్ జోన్‌లో కనిపించే 20 నుంచి 40 శాతం జాతులు ఈ శతాబ్దం చివరి నాటికి నశించవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
సముద్రంలో 200 నుండి 1,000 మీటర్ల లోతు ఉన్న ప్రాంతాన్ని ట్విలైట్ జోన్ అంటారు. సముద్ర జీవులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయడానికి కొన్ని UK విశ్వవిద్యాలయాల పరిశోధకులు పరిశోధన జరిపారు. అధిక ఉద్గారాల కారణంగా రాబోయే 150 సంవత్సరాలలో సముద్ర జీవులు తీవ్రంగా ప్రభావితం అవుతాయని కనుగొన్నారు.
ట్విలైట్ జోన్ లో అనేక రకాల జాతులు జీవిస్తాయి. అయితే అవి నివసించే ప్రాంతంలో బిలియన్ల టన్నుల ఆర్గానిక్ పదార్థాలు ఉన్నాయి. ట్విలైట్ జోన్ గురించి చాలా తక్కువ అధ్యయనాలు జరిగాయి. అయితే చరిత్ర అనుభవం ఆధారంగా, భవిష్యత్తును అంచనా వేయవచ్చని పరిశోధకులు తెలిపారు.
కార్డిఫ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పాల్ పియర్సన్ మాట్లాడుతూ.. ట్విలైట్ జోన్‌లో ఉన్న జాతులు పరిణామం చెందడానికి మిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఈ జోన్ ఫ్రీజ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతున్న తీరుతో ఆ జాతులు అంతరించేపోయే ప్రమాదం ఉన్నట్టు ఆయన అన్నారు.
Read More: Chetak: చేతక్ స్కూటీలు మరింత తొందరగా.. బజాజ్ కీలక నిర్ణయం