HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Captured American And British Tanks Showcased In Moscow

Russia Vs West : అమెరికా యుద్ధ ట్యాంకులతో రష్యాలో ఎగ్జిబిషన్.. ఎందుకు ?

Russia Vs West : యుద్ధం అంటే శత్రువుతో ప్రత్యక్షంగా చేసే పోరాటం మాత్రమే కాదు !!

  • By Pasha Published Date - 02:47 PM, Tue - 30 April 24
  • daily-hunt
Russia Vs West
Russia Vs West

Russia Vs West : యుద్ధం అంటే శత్రువుతో ప్రత్యక్షంగా చేసే పోరాటం మాత్రమే కాదు !! పరోక్షంగా చేసే మానసిక పోరాటం కూడా యుద్ధమే !! ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్నది కూడా అదే. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న పుతిన్.. మాస్కోలో ఓ అదిరిపోయే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏం ప్రదర్శించారో తెలుసా ? ఉక్రెయిన్‌లో తాము స్వాధీనం చేసుకున్న అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాల యుద్ధ ట్యాంకులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇటీవల ఉగ్రదాడితో మాస్కో దద్దరిల్లింది. ఫలితంగా మాస్కో పౌరుల మానసిక స్థైర్యం దెబ్బతింది. వారిలో దేశ సైన్యంపై నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతోనే రాజధాని మాస్కోలో ఇతర దేశాల నుంచి స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంకులను ప్రదర్శనకు ఉంచారు.మాస్కోలోని పోక్లోన్నయా హిల్‌ ఏరియాపై ఈ యుద్ధ ట్యాంకులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని రష్యా ఆర్మీ(Russia Vs West) వెల్లడించింది.

Moscow opens an exhibition of NATO and Ukrainian equipment for tourists pic.twitter.com/T84uUBC149

— What the media hides. (@narrative_hole) April 28, 2024

We’re now on WhatsApp. Click to Join

ఉక్రెయిన్‌లో రష్యా స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంకులివీ.. 

  • అమెరికాకు చెందిన M777 హోవిట్జర్ యుద్ధ ట్యాంకు
  • అమెరికన్ సాయుధ వాహనాలు “HMMWV M1151”, “HMMWV M998”
  • బ్రిటిష్ సాయుధ అంబులెన్స్ AT105 “సాక్సన్”
  • ఆస్ట్రియన్ సాయుధ వాహనం “Pinzgauer 712M”
  • ఫ్రాన్స్ దేశానికి చెందిన యుద్ధ ట్యాంకు “AMX-1” BRC
  • ఫిన్‌లాండ్ దేశానికి చెందిన ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్ Sisu Pasi XA-180/185
  • దక్షిణాఫ్రికాకు చెందిన Mamba MK2 సాయుధ కారు
  • ఉక్రెయిన్‌కు చెందిన ట్రిటాన్, బోగ్డాన్-2251 సాయుధ వాహనాలు

Also Read : Prajwal Revanna : దేవెగౌడ మనవడు ప్ర‌జ్వ‌ల్‌పై జేడీఎస్‌ వేటు.. ఎందుకో తెలుసా ?

మే 9న ప్రత్యేక కార్యక్రమం

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై రష్యా సాధించిన విజయాన్ని స్మరించుకునే మే 9న ప్రత్యేక కార్యక్రమాన్ని మాస్కోలో నిర్వహించ నున్నారు. ఈసందర్భంగా  మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో విక్టరీ డే పరేడ్‌ నిర్వహిస్తారు. ఈసారి పరేడ్‌కు యుద్ధ ట్యాంకుల ప్రదర్శన అదనపు హంగుగా నిలువనుంది.  మే 9న విక్టరీ డే పరేడ్ వేళ అమెరికాను ఉద్దేశించి.. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం గురించి పుతిన్ కీలక వ్యాఖ్యలు  చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • American Tanks
  • British Tanks
  • Moscow
  • Russia Vs West

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd