Bhutto – Sharif : పాకిస్తాన్‌లో సంకీర్ణ సర్కారే.. ఆ మూడు పార్టీల జట్టు!
Bhutto - Sharif : పాకిస్తాన్‌లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
- By Pasha Published Date - 10:56 AM, Mon - 12 February 24
Bhutto – Sharif : పాకిస్తాన్‌లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, పీపీపీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీలతో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై వారు కూలంకషంగా చర్చించారు. సంకీర్ణ సర్కారులో చేరేందుకు ముత్తహిదా ఖౌమీ మూవ్‌మెంట్ -పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ) పార్టీ కూడా చేరేందుకు రెడీ అయింది. పాక్ జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 101 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ అనుచరులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్- ఎన్‌కి 75 సీట్లు, బిలావల్ భుట్టో పార్టీ పీపీపీకి 54 సీట్లు, ఎంక్యూఎం-పీ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు 133 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరం. పీఎంఎల్- ఎన్, పీపీపీ, ఎంక్యూఎం-పీ పార్టీలన్నీ చేయి కలపడంతో వాటి సభ్యుల సంఖ్య(Bhutto – Sharif) 146కు చేరుతోంది. దీంతో ఆ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇక లాంఛనమే.
لاہور: پاکستان پیپلزپارٹی کی قیادت سے مسلم لیگ ن کا حکومت سازی کے لئے پہلا باضابطہ رابطہ
لاہور: مسلم لیگ ن کے صدر میاں شہباز شریف پاکستان پیپلزپارٹی سے حکومت سازی میں تعاون کیلئے بلاول ہاؤس پہنچ گئے
لاہور: صدر پی پی پی پی آصف علی زرداری، چیئرمین پی پی پی بلاول بھٹو زرداری اور… pic.twitter.com/bFTAo6JOPW
— PPP (@MediaCellPPP) February 11, 2024
We’re now on WhatsApp. Click to Join
సంకీర్ణ సర్కారులో చేరాల్సిందిగా ఎంక్యూఎం-పీ పార్టీని మాజీ ప్రధానమంత్రి, పీఎంఎల్ -ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు. నవాజ్ షరీఫ్‌తో కూడిన పార్టీ టీమ్ తాజాగా ఎంక్యూఎం పార్టీ కన్వీనర్ ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీతో భేటీ అయింది. ఈ సమావేశంలో పీఎంఎల్-ఎన్ నేతలు షెహబాజ్ షరీఫ్, మర్యం నవాజ్, ఇషాక్ దార్, అహ్సన్ ఇక్బాల్, రానా సనావుల్లా, అయాజ్ సాదిక్, ఖవాజా సాద్ రఫీక్, మరియం ఔరంగజేబ్, రాణా మషూద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ చర్చలో సంకీర్ణ సర్కారులో ఎంక్యూఎం పార్టీకి కేటాయించే పదవుల అంశంపై ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది.
Also Read : Lok Sabha Elections : టైమ్స్ నౌ సర్వే.. కాంగ్రెస్‌కు 9 ఎంపీ స్థానాలు.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్నో తెలుసా ?
ఈనేపథ్యంలో ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలిచిన ఇమ్రాన్ ఖాన్ అనుచరులు 101 మంది ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఆ పార్టీ కీలక నేత గోహర్ అలీ ఒక ప్రకటన విడుదల చేశారు. తాము పీపీపీ, పీఎంఎల్ -ఎన్ పార్టీలతో చేయి కలిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో కూర్చోవడాన్నే తాము గౌరవంగా భావిస్తామని తేల్చి చెప్పారు.