Bangladesh Train Accident : బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..20 మంది మృతి
గోధూళి ఎక్స్ ప్రెస్ రైలు, ఛటోగ్రామ్ వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు
- Author : Sudheer
Date : 24-10-2023 - 8:54 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఎక్కడో చోట రైలు ప్రమాద ఘటన వార్త వినిపిస్తూనే ఉంది. గత ఆరు నెలల వ్యవధిలో ఎన్ని ప్రమాదాలు జరుగగా..తాజాగా బంగ్లాదేశ్ (Bangladesh ) లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని ఖైరబ్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఢాకా వెళ్లే గోధూళి ఎక్స్ ప్రెస్ (Dhaka-bound Godhuli Express) రైలు, ఛటోగ్రామ్ వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి ( 20 killed) చెందగా పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. కిషోర్ గంజ్ జిల్లా భైరబ్ ప్రాంతం సమీపంలో నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన రైలు బోగీల నుండి 20 మృతదేహాలను వెలికితీశారు. తలకిందులైన బోగీల నుండి 100 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు, రైల్వే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి.
Read Also : Petrol Diesel Price: ఈరోజు హైదరాబాద్, విజయవాడలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?