Astroids: భూమికి దగ్గరగా గ్రహశకలం.. నాసా హెచ్చరిక..?
అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు ఉంటాయి. అవి అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరకు వస్తూ ఉంటాయి.
- By Anshu Published Date - 10:07 PM, Thu - 29 December 22
Astroids: అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు ఉంటాయి. అవి అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరకు వస్తూ ఉంటాయి. అయితే రేపు భూమికి అత్యంత దగ్గరగా ఓ ఆస్టరాయిడ్ రాబోతుంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని నాసా చెబుతోంది.వైజీ5 అనే ఆస్టరాయి 2022 భూమికి అత్యంత దగ్గరకు వస్తుందని, భూమికి సమీపంగా 3.1 మిలియన్ కిలోమాటర్ల దూరంతో ఈ గ్రహశకలం ప్రయాణించనుందనా నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ గ్రహశకలం అత్యంత ప్రమాదకరమని నాసా హెచ్చరిస్తోంది. గంటలకు 51,246 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయాణ వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువని నాసా హెచ్చరించింది. డిసెంబర్ 24న ఈ ఆస్టరాయిడ్ ను నాసా గుర్తించగా.. జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. అయితే గ్రహశకలాలను దారి మళ్లించేందుకు డార్ట్ పేరిట అమెరికా ప్రయోగం చేపట్టింది. ఈ డార్ట్ బరువు 570 కేజీలు ఉంటుందని, భూమివైపు వచ్చే గ్రహశకలాలను దారి మళ్లించడం లేదా నాశనం చేయడం దీని ఉద్దేశమని చెబుతున్నారు.
గ్రహశకలాలను ఢీ కొట్టడానికి స్పేస్‌షిప్ లను ముందుగానే ప్రయోగిస్తారు. సమయం ఉంటేనే ఇలా చేయడానికి వీలవుుతందని చెబుతున్నారు. అలాగే చైనా కూడా తమ భూభాగంపైకి వచ్చే గ్రహశకాలను నాశనం చేయడానికి రక్షణ వ్యవస్థనే ఏర్పాటు ఇప్పటికే చేసుకుంది. ఇలా దేశాలన్ని తమ భూభాగంపైకి వచ్చే గ్రహశకలాలను నాశనం చేసే టెక్నాలజీని రూపొందించుకుంటున్నాయి.
అయితే ఇప్పుడు భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలం వల్ల ఎలాంటి నష్టం ఉంటుందనే విషయంపై నాసా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో రేపు ఏమవుతుందనే ఆందోళన ఉంది. మరి ఈ గ్రహశకలం వల్ల భూమికి కలిగే నష్టమేంటి. దాని వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా అనే దానిపై నాసా వర్గాలు అంచనా వేస్తున్నారు.