France’s Train Network : ఫ్రాన్స్‌లో హై-స్పీడ్ రైలు సిగ్నళ్లఫై దాడి
ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలకు గంటల ముందు భారీ ప్రయాణానికి అంతరాయం ఏర్పడిందని ఆ దేశ జాతీయ రైలు సర్వీస్ తెలిపింది
- By Sudheer Published Date - 05:40 PM, Fri - 26 July 24

నాలుగేళ్లకోసారి జరిగే ఆటల సంబరం.. ఒలింపిక్స్ (Paris Olympics opening ceremony ) సందడి మొదలైంది. ఫ్రాన్స్ (Paris ) రాజధాని, ఫ్యాషన్ సిటీ పారిస్ లో ఈ క్రీడలు జరుగుతున్నాయి. కాసేపట్లో ఆట మొదలుకాబోతున్న తరుణంలో దాడి ఘటన సంచలనం రేపుతోంది. ఫ్రాన్స్‌లోని హై-స్పీడ్ రైలు మార్గాల సిగ్నల్ ఫై దాడి (Saboteurs struck France’s TGV high-speed train) జరిపారు. దీంతో రైళ్ల సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఈ అంతరాయం తో ప్రయాణికులు , క్రీడాకారులు స్టేషన్ లలో ఉండిపోయారు. పారిస్ ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలకు గంటల ముందు భారీ ప్రయాణానికి అంతరాయం ఏర్పడిందని ఆ దేశ జాతీయ రైలు సర్వీస్ తెలిపింది. భారీ భద్రత నేపథ్యంలో దాడి జరగడం ఇప్పుడు క్రీడాకారులను భయాందోళనకు గురి చేస్తుంది. ఇక ఈ దాడికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఒలింపిక్స్ విషయానికి వస్తే.. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు 32 క్రీడాంశాల్లో సత్తా చాటబోతున్నారు. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పోటీలో ఉన్నారు. గత టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకంతో యావత్ భారతావనిని మెప్పించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, హ్యాట్రిక్ పతక వేటలోనున్న తెలుగు షట్లర్ పీవీ సింధు, వరుసగా రెండోసారి పతకం అందుకోవాలని పట్టుదలగా ఉన్న బాక్సర్ లవ్లీనా, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, జంబో బృందంగా బరిలో ఉన్న షూటర్లు, పతకాన్ని పట్టేయాలనుకుంటున్న రెజ్లర్లు.. ఇలా చాలామందే ఉన్నారు. మరి ఎంతమంది ఎన్ని పతకాలు సాధిస్తారో చూడాలి.
Read Also : Jaggery Tea: బెల్లం టీ తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?