Ebrahim Raisi : కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. ఏమిటా హెలికాప్టర్ నేపథ్యం ?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ(Ebrahim Raisi), విదేశాంగ మంత్రిగా అమీర్ అబ్దుల్లా హియాన్‌లు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
- By Pasha Published Date - 10:39 AM, Mon - 20 May 24
Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ(Ebrahim Raisi), విదేశాంగ మంత్రిగా అమీర్ అబ్దుల్లా హియాన్‌లు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వీరిద్దరు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలికాప్టర్ ఆదివారం నాడు అజర్బైజాన్ దేశ సరిహద్దుల్లోని మంచు పర్వతాల్లో కుప్పకూలింది. ఈనేపథ్యంలో ఆ హెలికాప్టర్‌కు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
‘బెల్ 212’ హెలికాప్టర్‌ను ‘బెల్ టూ-ట్వెల్వ్’ అని కూడా పిలుస్తారు. రెండు బ్లేడ్లు ఉండే మిడ్ రేంజ్ హెలికాప్టర్ ఇది. 1968 నుంచి దీని వినియోగం మొదలైంది. వాస్తవానికి అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న ఫోర్ట్ వర్త్‌లో ఈ హెలికాప్టర్ తయారైంది. అయితే 1986 నుంచి దీని ఉత్పత్తి ప్రక్రియను కెనడాలోని కెనడాలోని మిరాబెల్ ప్రాంతంలో జరగసాగింది. అక్కడే బెల్ కమర్షియల్ హెలికాప్టర్ల ఉత్పత్తి పెద్దసంఖ్యలో జరిగింది. పౌర విమానయాన సంస్థలకు ఈ హెలికాప్టర్లను పెద్దసంఖ్యలో విక్రయించారు. ఇందులో పైలట్‌తో పాటు 14 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఈ హెలికాప్టర్ 2,268 కేజీల బరువును మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వియత్నాం యుద్ధం టైంలో అమెరికా కూడా ఈ హెలికాప్టర్లను వినియోగించింది.
Also Read :Chicken Price : చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. ఎందుకు ?
- ‘బెల్ 212’ హెలికాప్టర్‌ను అమెరికా తొలుత యుటిలిటీ హెలికాప్టర్ (UH)గా వినియోగించేది. ప్రజల తరలింపు, వైమానిక అగ్నిమాపక సామగ్రి మోహరింపు, సరుకు రవాణా, ఆయుధాల తరలింపు వంటి అవసరాలను దీన్ని వాడేవారు.
- ఆదివారం రోజు కూలిపోయిన ఇరాన్ మోడల్ ‘బెల్ 212’ హెలికాప్టర్‌ను ప్రయాణికులను తరలించడానికి అనుగుణంగా డిజైన్ చేశారు.
- బెల్ హెలికాప్టర్ తాజా వెర్షన్ పేరు ‘సుబారు బెల్ 412’. దీన్ని అమెరికా, కెనడా సహా పలు ఐరోపా దేశాల్లో పోలీసు ఉపయోగం, వైద్య రవాణా, దళాల రవాణా, విద్యుత్ అత్యవసర సేవలు, అగ్నిమాపక సేవల కోసం వాడుతున్నారు.
- బెల్ 212ను జపాన్ కోస్ట్ గార్డ్, థాయిలాండ్ పోలీసులు కూడా వినియోగిస్తున్నారు.
- ఇరాన్ ప్రభుత్వం వద్ద దాదాపు పది ‘బెల్ 212’ హెలికాప్టర్లు ఉన్నాయని అంచనా.
- 2018లో ఇరాన్లో ఇదే మోడల్‌కు చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో దాదాపు నలుగురు చనిపోయారు.
- 2023 సెప్టెంబర్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ సేవలు అందించే బెల్ 212 హెలికాప్టర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలో కూలిపోయింది.
Also Read : Haldiram: రూ. 70 వేల కోట్ల ఆఫర్.. నో చెప్పిన హల్దీరామ్ కంపెనీ..!
Related News
Ebrahim Raisi : ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై తొలి నివేదిక
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ ఆర్మీ తొలి నివేదిక విడుదల చేసింది. హెలికాప్టర్ ముందుగా నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించిందని, రూట్ దాటి వెళ్లలేదని తెలిపింది.