AIRCEL: ఎయిర్‌సెల్ అధినేత ఆనంద కృష్ణన్ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మృతి చెందారు. టెలికమ్యూనికేషన్స్, చమురు, గ్యాస్ వంటి అనేక రంగాల్లో వ్యాపారం విస్తరించిన కృష్ణన్, ఎంతో ప్రభావవంతమైన వ్యక్తి.
- By Kode Mohan Sai Published Date - 12:32 PM, Sat - 30 November 24

AIRCEL: ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మరణించారు. మృతికి గల కారణాలు ఇప్పటి తెలియరాలేదు. టెలికమ్యూనికేషన్స్ నుంచి చమురు, గ్యాస్ వరకు అనేక రంగాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆనంద కృష్ణన్, మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన మరియు సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు.
మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషాద వార్తను ధ్రువీకరించారు. “కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ అనేక సేవలను అందించారు. ఆయన అనేక దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించి సమాజానికి గొప్ప సేవలు చేసారు. ఆయన చేసిన కృషి చిరస్మరణీయం” అని ఇబ్రహీం తెలిపారు.
Terima perkhabaran pemergian mendiang Ananda Krishnan hari ini. Saya utus takziah buat keluarga mendiang dan semoga mereka tabah menghadapi dugaan ini.
Sumbangan mendiang dalam dunia korporat, filantropi dan kemasyarakatan pasti akan terus diingati. pic.twitter.com/kGOL5LoCsr
— Anwar Ibrahim (@anwaribrahim) November 28, 2024
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్ ప్రాంతంలో 1938 ఏప్రిల్ 1న జన్మించిన టి. ఆనంద కృష్ణన్, కృష్ణన్ పూర్వీకులకు భారత్‌తో సంబంధం ఉంది. ఆనంద కృష్ణన్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1964లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పట్టా పొందరు.
తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి చాలా అభివృద్ధి చెందారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆనందకు ముగ్గురు సంతానం. తన కుమారుడు థాయిలాండ్‌లో బౌద్ధ సన్యాసిగా మారాడు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు అతని వ్యాపార నిర్వహణలో పాలుపంచుకోలేదు.
ఐపీఎల్ జట్టుకు స్పాన్సర్‌గా కూడా ఆనంద కృష్ణన్:
ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద కృష్ణన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించారు. దక్షిణాదిలో ప్రముఖ టెలికాం కంపెనీ అయిన ఎయిర్‌సెల్‌కు సారథ్యం వహించిన కృష్ణన్, టెలికామ్ రంగంలో ఓ శక్తివంతమైన వ్యాపారికుడిగా పరిచయమయ్యారు. ఫోర్బ్స్ ప్రకారం, ఆయన డీల్ మేకర్లలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా పేరొందారు.
చమురు వ్యాపారంలోకి ప్రవేశించే ముందు, కృష్ణన్ బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసులను ప్రారంభించారు. తదుపరి, మల్టీమీడియా వెంచర్లను స్థాపించి, మ్యాక్సిస్ బీహెచ్‌డీ అనే టెలికాం కంపెనీని ఏర్పాటు చేసి, మలేషియాలో రెండవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఎదిగారు.
అవినీతి ఆరోపణలు:
2006లో, కృష్ణన్, ఎయిర్‌సెల్‌ను మాక్సిస్ గ్రూప్ ద్వారా తన బిజినెస్ సామ్రాజ్యానికి అనుసంధానించారని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని కంపెనీలు కృష్ణన్‌పై వివిధ ఆరోపణలు చేసింది, దీంతో కోర్టులో కేసులు దాఖలైనట్లు తెలుస్తోంది.
ఆనంద కృష్ణన్ స్థాపించిన కొన్ని ప్రముఖ కంపెనీలు:
- ఆస్ట్రో మలేషియా హోల్డింగ్స్: మలేషియాలో ప్రసిద్ధి చెందిన శాటిలైట్ టెలివిజన్ ప్రొవైడర్, ఇది ఆనంద కృష్ణన్ స్థాపించిన ఒక కీలక కంపెనీ.
- బుమి అర్మడా: ఈ సంస్థ చమురు సర్వీసులను అందిస్తూ, ఎనర్జీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించింది.
- ఎయిర్‌సెల్: భారతదేశంలో ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అయిన ఎయిర్‌సెల్, ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు స్పాన్సర్‌గా సేవలందించింది.
ఈ కంపెనీలు ఆనంద కృష్ణన్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో భాగంగా ఇవి కీలకంగా మారాయి.