Air Canada : టేకాఫ్ అయిన 30 నిమిషాలకే విమానంలో మంటలు..
ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం.. కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది
- Author : Sudheer
Date : 08-06-2024 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువుతున్నాయి. టేకాఫ్ అయినాకాసేపటికే పలు సాంకేతిక సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా బోయింగ్ ఫ్లైట్ (Air Canada Boeing) AC872 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జూన్ 5 అనగా బుధవారం నాడు ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం.. కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు జరగ్గానే ముందుగా విమానం రెక్కల దగ్గర మంటలు చెలరేగాయి. వెంటనే ప్రమాదాన్ని గమనించిన పైలెట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో.. 30 నిమిషాల వ్యవధిలోనే విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక విమానంలో పేలుడు జరిగి మంటలు అంటుకున్న సమయంలో.. దానిలో ప్యాసింజర్స్, సిబ్బంది కలిపి మొత్తంగా సుమారు 400 మంది వరకు ఉన్నట్లు తెలిపారు. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఇంజిన్ కంప్రెసర్ సమస్య వల్లే మంటలు చెలరేగాయని ఎయిర్ కెనడా ప్రతినిధి తెలిపారు. “విమానం ల్యాండ్ అయిన తర్వాత, సాధారణ ఆపరేటింగ్ ప్రక్రియల ప్రకారం ఎయిర్‌పోర్ట్ రెస్పాన్స్ వెహికల్స్ ద్వారా దీనిని తనిఖీ చేశారు. అది గేట్‌కు స్వయంగా ట్యాక్సీ చేయబడింది” అని ప్రతినిధి CP24కి తెలిపారు. ఈ సంఘటనలో పాల్గొన్న బోయింగ్ 777-300ER ఎయిర్‌క్రాఫ్ట్ మార్చి 2008 నుంచి ఎయిర్ కెనడా ఫ్లీట్‌లో భాగంగా ఉంది. వీటిలో 19 విమానాలు ప్రస్తుతం యాక్టివ్ సర్వీస్‌లో ఉన్నాయి.
Read Also : DK Aruna : డీకే అరుణకు కేబినెట్ మంత్రిత్వ శాఖ..?