Polio Outbreak : గాజాలో పోలియో మహమ్మారి.. 25 ఏళ్ల తర్వాత తొలి కేసు
గత 10 నెలలుగా ఎడతెరిపి లేని విధంగా ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న వైమానిక, భూతల దాడుల వల్ల గాజాలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది.
- By Pasha Published Date - 08:14 AM, Mon - 19 August 24

Polio Outbreak : పోలియో మహమ్మారి పాలస్తీనాలోని గాజా ప్రాంతాన్ని(Polio Outbreak) వణికిస్తోంది. గత 10 నెలలుగా ఎడతెరిపి లేని విధంగా ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న వైమానిక, భూతల దాడుల వల్ల గాజాలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఇజ్రాయెల్ మిస్సైళ్లు, బాంబుల ధాటికి గాజాలోని డ్రైనేజీ వ్యవస్థ మొత్తం ధ్వంసమైపోయింది. ఇళ్లన్నీ కాంక్రీటు కుప్పలుగా మిగిలాయి. భవిష్యత్తుపై ప్రజల కలలు కల్లలుగా మారాయి.
We’re now on WhatsApp. Click to Join
కట్ చేస్తే.. ఇప్పుడు గాజా ప్రాంతంలోని రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి. పిల్లలు వాటిలోనే ఆడుతూ, నడుస్తూ తిరుగుతున్నారు. ఇక టాయిలెట్లు కూడా గాజా ప్రజలకు అందుబాటులో లేవు. దీంతో మానవ వ్యర్థాలను టెంట్లకు సమీప ప్రాంతాల్లో వేస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఫలితంగా అక్కడ ప్రమాదకర పోలీయో కేసులు బయటపడుతున్నాయి. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Also Read :Cement Garlic: ధరల ఎఫెక్ట్, మార్కెట్లోకి సిమెంట్‌తో చేసిన వెల్లుల్లి
ఇప్పటికే ఓ పోలియో కేసును గాజాలో వైద్యాధికారులు నిర్ధారించారు. గత 25 ఏళ్లలో అక్కడ పోలియో కేసు బయటపడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అక్కడి పిల్లలందరికీ వేగంగా టీకాలు వేసి పూర్తి స్థాయి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని ఐక్యరాజ్యసమితి, యూనిసెఫ్ వంటి సంస్థలు అంటున్నాయి. గాజాలోని పదేళ్లలోపు వయసున్న 6.40 లక్షల మంది పిల్లలకు ఈ నెలాఖరులో పోలియో టీకాలు వేస్తామని చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ కోసం గాజాలోకి 16 లక్షల పోలియో వ్యాక్సిన్ డోసులు తీసుకురావాలి భావిస్తున్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్‌తో హమాస్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే 99 శాతం మంది గాజా పిల్లలకు పోలియో వ్యాక్సినేషన్ పూర్తయింది. అయితే గత 11 నెలల్లో అక్కడ జన్మించిన పిల్లలకు పోలియో చుక్కలు వేయలేదు. దీతో పోలియో వ్యాక్సినేషన్ స్థాయి గాజాలో 99 శాతం నుంచి 86 శాతానికి డౌన్ అయింది. ఈ నెలాఖరులో తాము పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సవ్యంగా నిర్వహించాలంటే హమాస్ – ఇజ్రాయెల్ వారం రోజుల పాటు పరస్పర కాల్పుల విరమణను పాటించాలని ఐక్యరాజ్యసమితి, యూనిసెఫ్ కోరుతున్నాయి.