Zakir Naik : జకీర్..ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు..జాగ్రత్త ..!!
Zakir Naik Controversial comments : వివాహమైనా మగాడిని మహిళలు పెళ్లాడటం ఏమాత్రం తప్పు కాదనేలా ఆయన మాట్లాడారు
- Author : Sudheer
Date : 09-10-2024 - 10:01 IST
Published By : Hashtagu Telugu Desk
మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసి అందరి చేత ఛీ అనిపించుకుంటున్నాడు ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ (Radical Islamic preacher Zakir Naik). నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ..అందరి చేత చివాట్లు తింటున్నప్పటికీ జాకీర్ తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మహిళల గురించి చాలా దారుణంగా మాట్లాడి మరో వివాదానికి తెరలేపారు. వివాహమైనా మగాడిని మహిళలు పెళ్లాడటం ఏమాత్రం తప్పు కాదనేలా ఆయన మాట్లాడారు. ఒకవేళ మహిళ పెళ్లి చేసుకోకుండా అలాగే వుంటే బజారు మనిషిలా మిగిలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలా మహిళలను కించపర్చేలా మాట్లాడి మరోసారి వివాదంలో నిలిచాడు.
గతంలో మనీ లాండరింగ్‌కు పాల్పడటంతోపాటు, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో జకీర్ (Zakir Naik) పై భారత ప్రభుత్వం (Government of India
) చర్యలకు సిద్దమైంది. దాంతో 2016లో అతను ఇండియా ను విడిచిపెట్టి మలేషియాకు చేకేసాడు. గత ఎనిమిదేళ్లుగా అతడు ఒక్కసారి కూడా భారత్‌లో అడుగుపెట్టలేదు. అయితే తీవ్ర అభియోగాల నేపథ్యంలో జకీర్ నాయక్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా, జకీర్ ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్నాడు. ఆ దేశంలోని కీలక నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ సహా పలు ఇతర ప్రాంతాల్లో అతను ఉపన్యాసాలు ఇవ్వనున్నాడు.
ఈ క్రమంలో తాజాగా ఆయన మహిళలపై కీలక వ్యాఖ్యలు చేసి ఛీ కొట్టించుకుంటున్నాడు. ఇస్లాం మతం (Islam ).. ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లాడేందుకు అనుమతిస్తుంది. అంటే అప్పటికే పెళ్లయి భార్య వున్న పురుషుడు మరో మహిళను ఇష్టపడవచ్చు. పెళ్లాడి సంతానాన్ని కూడా పొందవచ్చు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన జకీర్ నాయక్ ఈ సాంప్రదాయం తప్పేమీ కాదనేలా కామెంట్ చేశారు. పెళ్లి చేసుకోడానికి అబ్బాయి దొరకకపోతే ఆ అమ్మాయి ముదు రెండు దారులు వుంటాయని, ఒకటి పెళ్లిచేసుకోకుండా మిగిలిపోవడం, రెండోది పెళ్లయిన వ్యక్తిని వివాహం చేసుకోవడమని జకీర్ నాయక్ అన్నారు. అయితే ఇందులో పెళ్లి చేసుకోకుండా వుండిపోవడం కంటే పెళ్లయిన వ్యక్తికి భార్యగా వెళ్లడమే మంచిదని వ్యాఖ్యానించారు. అలాంటి పెళ్లితో ఆమెకు గౌరవం పెరుగుతుందని జాకీర్ నాయక్ అన్నారు.
పెళ్లి చేసుకోకుండా వుండిపోయేవాళ్లు ‘బజార్ ఔరత్’ (బజారు మహిళ) గా మిగిలిపోతారంటూ జకీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్ళి కాని మహిళలు పబ్లిక్ ప్రాపర్టీగా అతడు పేర్కొన్నారు. రెండో పెళ్లో లేక మూడో పెళ్లో.. మొత్తానికి పురుషుడితో వుంటేనే మహిళకు గౌరవమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు, వివాహ వ్యవస్థపై జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి… అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక శాతం నెటిజన్లు నాయక్ వ్యాఖ్యల స్త్రీలపై ఆయనకున్న ద్వేషాన్ని తెలియజేస్తాయని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళల హక్కులకు హానికరమైనవిగా పేర్కొంటున్నారు. మరికొందరు పాకిస్తాన్ ఇలాంటి ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు. మహిళలంటే ఆదిపరాశక్తిగా కొలుస్తాం..అలాంటి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన జాకీర్ తో నడిరోడ్డు ఫై కాల్చి చంపేయాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.