Maharashtra : అటవీ ప్రాంతంలో మహిళలను చెట్టుకు కట్టేసిన పారిపోయిన దుండగులు..
50 మహిళను దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు గొలుసులతో కట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది
- By Sudheer Published Date - 04:08 PM, Mon - 29 July 24

దేశంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోతుంది. ఒంటరి మహిళే కాదు అభం శుభం తెలియని చిన్నారులపై కూడా కామాంధులు దాడులు చేస్తున్నారు. అంతే కాదు మహిళాలపై దాడులు చేస్తూ వారి ఒంటిపై ఉన్న నగదు , డబ్బులు లాక్కొని పోతున్నారు. ఇలా ప్రతి రోజు పదుల సంఖ్యలో మహిళలపై దాడులు అనే వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా 50 మహిళ (50 yrs Old Woman)ను దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు గొలుసులతో కట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా (Sindhudurg District)లో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
సోనూర్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి రోజులాగానే గొర్రెలను తీసుకోని అటవీ ప్రాంతంపై వెళ్లాడు. కాసింత దూరంలో అతడికి మహిళ ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే ఆమె వద్దకు చేరుకోగా.. గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉన్న మహిళను చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ..చెట్టుకు కట్టేసిన మహిళను కాపాడారు. అమెరికా పాస్‌పోర్ట్ ఫొటో కాపీ, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు, ఇతర పత్రాలు ఆమె వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆమె మానసిక, ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. సదరు మహిళను లలితా కయీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నదని , ఆ మహిళ పదేళ్లుగా భారత్‌లో ఉంటున్నదని, ఆమె వీసా గడువు ముగిసినట్లు గుర్తించామన్నారు. తమిళనాడుకు చెందిన భర్త ఆమెను అడవిలోని చెట్టుకు గొలుసులతో కట్టేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఆమె ఎన్ని రోజులు ఆ అడవిలో అలాంటి దీనస్థితిలో ఉన్నదో అని వారు వాపోయారు.
Read Also : FM Nirmala Sitharaman : లోక్ సభ లో తల బాదుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్