Metro : మెట్రోలో చేయకూడని పని చేసిన మహిళ..అధికారులు సీరియస్
Metro : ఇటీవల మెట్రో స్టేషన్ల పరిధిలో పొగాకు వినియోగం, రవాణాను కూడా నిషిద్ధం చేశారు. గుట్కా నములుతూ ప్రయాణించిన వ్యక్తి వీడియో వైరల్ కావడంతో మెట్రో సంస్థ మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది
- By Sudheer Published Date - 06:39 PM, Mon - 28 April 25

బెంగళూరు మెట్రో(Bengaluru Metro)లో ఒక మహిళ తన వెంట తెచ్చుకున్న లంచ్ బాక్స్(Lunch box) ను రన్నింగ్ ట్రైన్ లో తినడం అధికారులు గమనించి సీరియస్ అయ్యారు. ఈ ఘటన ఏప్రిల్ 26న మదవర మెట్రో స్టేషన్ నుంచి మగది రోడ్ వరకు ప్రయాణిస్తున్న సమయంలో చోటుచేసుకుంది. మెట్రోలో ఆహారం తినడం నిషిద్ధం అనే నిబంధనను ఉల్లంఘించినందుకు ఆమెకు రూ. 500 జరిమానా విధించారు. కదులుతున్న రైల్లో ఆమె లంచ్ చేయడం మెట్రోలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు.
Shantakumari : CS శాంత కుమారికి కీలక పదవి..?
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం.. మెట్రో రైళ్ళలో తినడం, తాగడం పూర్తిగా నిషిద్ధం. దీనివల్ల రైళ్ల పరిశుభ్రత దెబ్బతినకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రైలు ప్రయాణ సమయంలో ఆహారం తినడం వల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగడమే కాకుండా, పరిశుభ్రతపై ప్రతికూల ప్రభావం పడతుందనే ఉద్దేశంతో ఈ నిబంధనను విధించినట్లు స్పష్టం చేశారు.
ఇటీవల మెట్రో స్టేషన్ల పరిధిలో పొగాకు వినియోగం, రవాణాను కూడా నిషిద్ధం చేశారు. గుట్కా నములుతూ ప్రయాణించిన వ్యక్తి వీడియో వైరల్ కావడంతో మెట్రో సంస్థ మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మెట్రోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడూ నిబంధనలు గౌరవించి, రైలులో పరిశుభ్రతను కాపాడటానికి సహకరించాలని మెట్రో అధికారులు కోరుతున్నారు. ప్రజలు కూడా బాధ్యతాయుతమైన ప్రవర్తనతో మెట్రో ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగ్గా మార్చాల్సిన అవసరం ఉంది.